ఇది అత్యంత మహిమాన్విత గణపతి ఆలయం.. రోజూ లక్షలాది మంది భక్తులు.. కోట్లల్లో ఆదాయం.. ఎక్కడో తెలుసా..?

|

Sep 02, 2023 | 9:35 PM

దేశ విదేశాల నుండి ధనవంతులు మొదలు సామాన్యుల వరకు ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతిరోజూ దాదాపు 25 వేల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. కోట్లాది విరాళాలు వచ్చే దేశంలోని ఆ దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఇది ఒకటి. నివేదికల ప్రకారం ఈ ఆలయానికి ఏటా 75 కోట్ల నుండి 125 కోట్ల వరకు విరాళాలు వస్తాయి. ఇక్కడ పెట్టే నైవేద్యాలు..

ఇది అత్యంత మహిమాన్విత గణపతి ఆలయం.. రోజూ లక్షలాది మంది భక్తులు.. కోట్లల్లో ఆదాయం.. ఎక్కడో తెలుసా..?
Siddhivinayak Temple Mumbai
Follow us on

సెప్టెంబర్ 19 నుంచి దేశవ్యాప్తంగా గణేశోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే అట్టహాసంగా జరుగుతున్నాయి. 10 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 28 వరకు దేశమంతా బప్పా భక్తిలో మునిగితేలుతుంది. గణేష్ ఉత్సవ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌ వినాయకుడు ఆ తర్వాత ముంబై మహాగణపతి ఉత్సవాలు. ముంబైలో జరిగే గణపతి ఉత్సవాలు.. ప్రపంచ ప్రసిద్ధి. ప్రతి ఒక్కరూ చూడదగ్గ వేడుక. ఇక్కడ లాల్ బాగ్ రాజు తర్వాత ఎక్కువగా చర్చించేది సిద్ధివినాయక దేవాలయం. గణేశుడి ఆలయాలలో ఒకటైన సిద్ధివినాయకుని గణేష్ ఉత్సవాల సమయంలో భారతదేశం, విదేశాల నుండి కూడా చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖులు సందర్శిస్తారు.

ముంబైలోని సిద్ధివినాయక దేవాలయాన్ని 1801 నవంబర్ 19న నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన డబ్బును ఓ మహిళ రైతు ఇచ్చారని చెబుతారు. ఆ స్త్రీకి సంతానం లేదు. ఈ ఆలయానికి ఎవరు వచ్చినా పూర్తి భక్తితో, బప్పా ఆశీర్వదించాలని తద్వారా ఏ స్త్రీ సంతానం లేకుండా ఉండకూడదని ఆమె కోరుకుంది.అంతేకాదు.. ఇక్కడి ఆలయంలో కొలువైన గణేశుడికి మరో విశిష్టత కూడా ఉంది..

సిద్ధివినాయకుని ఆలయంలో ప్రత్యేక గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ కొలువైన గణేశుడి తొండం కుడి వైపుకు తిరిగి ఉంటుంది. అయితే చాలా విగ్రహాలలో గణపతి తొండం ఎడమవైపు ఉంటుంది. ఈ వినాయకుడి విగ్రహం నల్లరాతితో చెక్కబడింది. ఇది 2.5 అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ ఆలయంలో సిద్ధివినాయకుని ఇద్దరు భార్యలు సిద్ది, బుద్ధితో కొలువై ఉంటాడు. ఒకచేతిలో కమలం, ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో తావళం, ఒక చేతిలో కుడుములు ఉన్న పాత్ర ఉన్నాయి. ప్రముఖులు, వ్వాపార వేత్తలు, సినీ ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శిస్తుండటంతో ఈ ఆలయానికి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఈ దేవాలయం గోపురం లోపలి భాగంలోని పైకప్పు బంగారంతో తాపడం చేయడం జరిగింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడి సిద్ధివినాయకుని ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. భారతదేశం, విదేశాల నుండి ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాదు..దేశ విదేశాల నుండి ధనవంతులు మొదలు సామాన్యుల వరకు ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతిరోజూ దాదాపు 25 వేల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. కోట్లాది విరాళాలు వచ్చే దేశంలోని ఆ దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఇది ఒకటి. నివేదికల ప్రకారం ఈ ఆలయానికి ఏటా 75 కోట్ల నుండి 125 కోట్ల వరకు విరాళాలు వస్తాయి. ఇక్కడ పెట్టే నైవేద్యాలు.. ముంబై మొత్తాన్ని పోషించగలదని కూడా చెబుతారు. కోరిన కోరికలు నెరవేరిన భక్తులు ఇక్కడి ఆలయానికి రహస్య దానం చేస్తుంటారని కూడా చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..