Ganesh Chaturthi 2021: గణపతికి రూ. 6 కోట్ల విలువజేసే బంగారం కిరీటం కానుకగా ఇచ్చిన భక్తుడు .. ఎక్కడంటే..

|

Sep 10, 2021 | 6:22 PM

Ganesh Chaturthi 2021:  దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు కరోనా నిబంధనలను పాటిస్తూ.. ఘనంగా నిర్వహించుకుంటున్నారు.  అయితే వినాయక చవితి అంటే ముందుగా గుర్తుకొచ్చే రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇక్కడ..

Ganesh Chaturthi 2021: గణపతికి రూ. 6 కోట్ల విలువజేసే బంగారం కిరీటం కానుకగా ఇచ్చిన భక్తుడు .. ఎక్కడంటే..
Pune Ganesha
Follow us on

Ganesh Chaturthi 2021:  దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు కరోనా నిబంధనలను పాటిస్తూ.. ఘనంగా నిర్వహించుకుంటున్నారు.  అయితే వినాయక చవితి అంటే ముందుగా గుర్తుకొచ్చే రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా గణపతి నవరాత్రులను నిర్వహిస్తారు. అయితే గత ఏడాది కరోనా నేపథ్యంలో చవితి ఉత్సవాలపై నిషేధం కొనసాగగా…. ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలకు పరిమిత సంఖ్యలో అనేక ఆంక్షల మధ్య అనుమతులను ఇచ్చారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ భక్తుడు గణపతికి బంగారు కిరీటాన్ని సమర్పించాడు. పూణేలోని ప్రసిద్ధ , పురాతన గణేష్ దేవాలయాలలో ఒకటి  శ్రీమంత్ దగాడు సేథ్ హల్వాయి గణపతి దేవాలయం. ఇక్కడ గణపతికి సుమారు 5 కిలోల బంగారంతో తయారు చేసిన కిరీటాన్ని భక్తుడు.  విరాళంగా ఇచ్చారు. ఈ కీరిటం విలువ సుమారు రూ .6 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. చవితి వేడుకలకు మండపంలో కొలువైన గణపతికి బంగారపుకిరీటం, కొత్త బట్టలు సహా కానుకగా ఇచ్చాడు.

మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన వేడుక గణపతి నవరాత్రి ఉత్సవాలు. అయితే ఈ ఏడాది కూడా కోవిడ్ -19  థర్డ్ వేవ్ ముప్పు ఉందని హెచ్చరిక నేపథ్యంలో దీనిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం, అధికారులు పరిమిత సంఖ్యలో కరోనా నిబంధనల నడుమ ఉత్సవాలకు అనుమతులు ఇచ్చారు. ఇలా ఎటువంటి ఆడంబరం, సంబరాలు లేకుండా సాదాసీదాగా గణపతి ఉత్సవాలను జరుపుకోవడం వరసగా ఇది రెండో సంవత్సరం.

మహేష్ సూర్యవంశీ నగరంలోని గణపతి ఆలయం చవితి వేడుకలకు ప్రసిద్ధి.  ఇక్కడ వినాయక మండపంలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. నిర్వహిస్తున్నామని తెలిపారు.  భక్తులు ఒక్కసారి భారీ సంఖ్యలో హాజరుకాకుండా ఆన్‌లైన్ ‘దర్శనం’ ఏర్పాటు చేశారు.

ఇక మహారాష్ట్రలో వినాయక చవితి ఉత్సలను కరోనా నిబంధనలు పాటించకుండా జరుపుకుంటే వారు ఐపిసి సెక్షన్ 188  కింద నేరస్థులుగా పరిగణింపబడతారని పోలీసులు తెలిపారు. ఇక విగ్రహాలను తీసుకువచ్చేటప్పుడు , వాటి నిమజ్జనం సమయంలో పబ్లిక్ సర్కిల్స్‌లో 10 మందికి మించి ప్రజలు ఊరేగింపులో పాల్గొనకూడదు. ఇక ఇంట్లో గణపతిని తీసుకురావడానికి ఐదుగురికి మించి ఉండరాదంటూ మార్గదర్శకాలను విడుదల చేశారు. 

 

 

Also Read:  చిన్నారులు సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి చిట్కాలను పాటించి చూడండి..

RGV-Apsara Rani: క్రాక్ సినిమా ఐటెం భామ ‘అప్సర రాణి’తో పబ్‌లో చిందులేసిన ఆర్జీవీ .. వీడియో వైరల్..