Dussehra 2023: దసరా వేడుకలు 23నా?.. 24నా? క్లారిటీ ఇచ్చిన దుర్గ గుడి వేద పండితులు

| Edited By: Ravi Kiran

Oct 20, 2023 | 7:48 AM

చిత్త నక్షత్రంలో పాడ్యమి నాడు కలశ స్థాపన, ఆఖరి పాదంలో పూర్ణహుతి.. శ్రావణ నక్షత్రం ఆఖరిపాదంలో కలశ ఉద్వాసన వుంటుందన్నారు. దసరా ఎప్పుడు అని భక్తులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.  భక్తితో  పండుగ ఎప్పుడు జరుపుకున్నా  ప్రతిఫలం ఒకేలా ఉంటుందన్నారు వైదిక కమిటీ సభ్యులు ఉమాకాంత్‌ 

Dussehra 2023: దసరా వేడుకలు 23నా?.. 24నా? క్లారిటీ ఇచ్చిన దుర్గ గుడి వేద పండితులు
Dasara Celebration
Follow us on

భక్తితో  ప్రార్ధించడమే పూజ. సంతోషంగా  ఉండడమే పండుగ. దసరా ఇప్పుడా!  అప్పుడా ! ఎప్పుడు?  అనే సందేహాలే వలదు. ఇది దుర్గ గుడి వేద పండితుల సందేశం. ఇంద్రకీలాద్రిపై విజయదశమి ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది వైదిక కమిటీ..  అమ్మలగన్న అమ్మ  బెజవాడ దుర్గా మల్లేశ్వర  సన్నిధి భక్త జనసంద్రాన్ని తలిపిస్తోంది. ఇంద్రకీలాద్రిపై  శరన్నవరాత్రులు  వైభోవోపేతంగా కొనసాగుతున్నాయి.

మరోవైపు దసరా ఎప్పుడనేది తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన చర్చగా మారింది.  ఈ  అంశంపై స్పందించారు  ఇంద్రకీలాద్రి వైదిక కమిటీ సభ్యులు  ఉమాకాంత్‌.  మహర్నవమి, విజయదశమి రెండు వేడుకలను ఒకే రోజు నిర్వహిస్తున్నట్టు చెప్పారాయన. 23 నే ఇంద్రకీలాద్రిపై దసరా అని స్పష్టం చేశారు.

చిత్త నక్షత్రంలో పాడ్యమి నాడు కలశ స్థాపన, ఆఖరి పాదంలో పూర్ణహుతి.. శ్రావణ నక్షత్రం ఆఖరి పాదంలో కలశ ఉద్వాసన వుంటుందన్నారు. దసరా ఎప్పుడు అని భక్తులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.  భక్తితో  పండుగ ఎప్పుడు జరుపుకున్నా  ప్రతిఫలం ఒకేలా ఉంటుందన్నారు వైదిక కమిటీ సభ్యులు ఉమాకాంత్‌

ఇవి కూడా చదవండి

70 ఏళ్ల తరువాత తొలిసారిగా  దుర్గమ్మ మహాచండీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. శుక్రవారం మరెంతో విష్టష్టమైనది.  మూలనక్షత్రం. అమ్మవారి జన్మనక్షతం.. దుర్గమ్మ సరస్వతీ రూపంలో సాక్షాత్కరిస్తారు.

దుర్గా మల్లేశ్వరులకు ప్రభుత్వం తరపున సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రిపై  భద్రతను కట్టుదిట్టం చేశారు. కొండపైకి ఫోర్‌ వీలర్స్‌కు అనుమతి వుండదు. వీఐసీ దర్శనాలు కూడా రద్దు.  భక్తులు సహకరించాలని కోరారు పోలీసులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..