Vastu Tips: ఉదయం లేచిన వెంటనే ఈ 5 పనులు చేయకండి.. ఎందుకంటే..

|

Aug 15, 2022 | 6:37 PM

Morning Vastu Tips: ఉదయం పూట, తెలిసి లేదా తెలియక చాలా మంది చేసే కొన్ని పొరపాట్లు వారి పనితోతోపాటు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. ఉదయం 4 పనులు చేయడం అశుభం అని తెలుసుకోండి.

Vastu Tips: ఉదయం లేచిన వెంటనే ఈ 5 పనులు చేయకండి.. ఎందుకంటే..
Morning Vastu Tips
Follow us on

ఉదయం తెలిసి లేదా తెలియక చాలా సార్లు ఇలాంటి తప్పులు చేస్తుంటారు. అది వారి పని, ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అలాంటి కొన్నింటిని చాలా సార్ల మన ఇంట్లోని పెద్దవారు గుర్తు చేస్తుంటారు. అవి ఉదయం లేచిన తర్వాత అస్సలు చేయకూడదు. లేకపోతే అదృష్టం బదులుగా.. దురదృష్టం నీడలా వస్తుంది. ఉదయాన్నే ఏ 4 పనులు చేస్తే అశుభం అని తెలుసుకుందాం.

అద్దం..

ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో తమను తాము చూసుకుంటారు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం శుభమైనదిగా పరిగణించబడలేదు. ఉదయం నిద్రలేచిన తర్వాత ముందుగా భగవంతుని దర్శనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోజు చక్కగా ప్రారంభమవుతుంది. అలా కాదుఅంటే మీ అర చేతులను చూసుకోవడం ఉత్తమం.

ఆపు చూడండి

మురికి పాత్రలు

ఉదయం నిద్రలేచిన వెంటనే మురికి పాత్రలు చూడటం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. శాస్త్రాల ప్రకారం, రాత్రి వంటగదిని శుభ్రం చేసిన తర్వాత నిద్రపోవాలి. మురికి పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది. ఎందుకంటే కడగని పాత్రల నుంచి దుర్వాసన వస్తుంది. అలా రాత్రి మొత్తం ఆ పాత్రల నుంచి చెడిపోయిన వాసన ఇంట్లో పెరిగిపోతుంది. దీంతో మనం నిద్రలో ఆ దుర్వాసనను తీసుకుంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీంతో ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది.

నీడ

ఉదయం నిద్రలేచిన తర్వాత మొదటి చూపు తనపై లేదా ఇతరుల నీడపై పడటం మంచిది కాదని నమ్ముతారు. నీడను చూడటం రాహువు చిహ్నంగా పరిగణించబడుతుంది. నీడను చూడటం ఒక వ్యక్తిలో ఉద్రిక్తత, భయం, వాతావరణాన్ని సృష్టిస్తుంది. రోజంతా పనిలో ఇబ్బందులు ఉంటాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది.

ఆవు ఫోటో

ఉదయం లేవగానే ఆవు కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే శాస్త్రాల ప్రకారం, ఉదయం వేళ మొదటి చూపు క్రూర జంతువుపై కాకుండా ఆవు వంటి సాధు జంతువులను చూడటం వల్ల మన మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది.  

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం