Diwali 2024: దీపావళి రోజు ఇవి దానం చేస్తే.. మీ ఇంటి సిరులు కురవడం ఖాయం

|

Oct 30, 2024 | 4:22 PM

దీపావళి పర్వదినాన్ని ఉత్సాహంగా జరుపుకునేందుకు ప్రజలంతా సిద్దమవుతున్నారు. అయితే పండగ రోజున కొన్ని రకాల దానాలు చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల వస్తువులను దానం చేయకూడదని అంటున్నారు. ఇంతకీ ఏ వస్తువులను దానం చేయాలి.? ఎలాంటి చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం...

Diwali 2024: దీపావళి రోజు ఇవి దానం చేస్తే.. మీ ఇంటి సిరులు కురవడం ఖాయం
deeparadhana
Follow us on

దీపావళి పర్వదినాన్ని జరుపుకునేందుకు దేశప్రజలంతా సిద్ధమవుతున్నారు. కార్తీక మాసంలో అమావాస్య రోజున జరుపుకునే దీపావళి రోజు ఇంట్లో లక్ష్మీ దేవిని పూజిస్తే అదృష్టం కలిసొస్తుందని విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా దుకాణ సముదాయాల్లో లక్ష్మీ దేవి పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు. ఇక దీపావళి రోజున కొన్ని రకాల వస్తువులను దానం చేయడం కూడా మంచిదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను దానం చేయడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దీపావళి రోజున చీపురు దానడం చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని పండితులు అంటున్నారు. సాధారణంగా చీపురును లక్ష్మీకి ప్రతిరూపంగా భావిస్తారనే విషయం తెలిసిందే. అలాగే పేదలకు ఆహారం, స్వీట్లు దానం చేయాలని చెబుతున్నారు. ఇలా చేస్తే మీ ఇంట సంతోషం వెల్లివిరియడం ఖాయమని అంటున్నారు. కుబేరున్ని ప్రసన్నం చేస్తుందని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు బాగుంటాయని అంటున్నారు.

ఇక దీపావళి రోజున గోవుకు సేవ చేయడం కూడా మంచిదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆవులు ఉండే ఆశ్రమానికి డబ్బును విరాళంగా అందించడం, ఆవులకు మేత వేయడం వల్ల మంచి జరుగుతుందని అంటున్నారు. ఇక దీపావళి రోజున చిన్న పిల్లలకు కొత్త బట్టలు దానం చేయడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుందని అంటున్నారు.

ఇవి దానం చేయకూడదు..

దీపావళి రోజు ఇనుమును దానం చేయకూడదని పండితులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల దురదృష్టానికి దారి తీస్తుంది. ఇనుము రాహువుకు సంబంధించినదిగా పరిగణిస్తారు. ఇనుమును దానం చేయడం వల్ల రాహువు నుంచి చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే దీపావళి రోజున ఉప్పును దానం చేయకూడదు. ఇది మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుందని అంటున్నారు. దీపావళి రోజున డబ్బు లావాదేవీలు శుభప్రదంగా పరిగణించబడవు. ఈరోజు అప్పు చేయకూడదు, అలాగే ఎవరికీ అప్పు కూడా ఇవ్వొద్దు.

నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..