Diwali 2024: దీపావళి పండగ రోజున మాత్రమే లక్ష్మీదేవి పూజ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే

|

Oct 21, 2024 | 3:43 PM

దీపావళి పండగ సందడి మొదలైంది. లక్ష్మీదేవికి స్వాగతం చెప్పడానికి రెడీ అవుతున్నారు. దీపాలు వెలిగించడానికి, బాణాసంచా కాల్చడానికి పిల్లలు , పెద్దలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏడాదిలో మిగిలిన రోజుల్లో లక్ష్మీ దేవిని ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా పూజించడం తరచుగా చూసి ఉంటారు. అయితే దీపావళి పండగ సందర్భంగా లక్ష్మీదేవిని సూర్యోదయం తర్వాత పూజించాలనే నియమం ఉంది. రాత్రి సమయంలో లక్ష్మీదేవికి పూజలు ఎందుకు చేస్తారంటే

Diwali 2024: దీపావళి పండగ రోజున మాత్రమే లక్ష్మీదేవి పూజ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే
Diwali Puja
Follow us on

దీపావళి, దీపాల పండుగ… దీపావళిని మన దేశంలోని హిందువలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు జరుపుకుంటారు. దీపావళి భారతీయహిందూ సంస్కృతిలో చాలా ముఖ్యమైన, పెద్ద పండుగగా పరిగణించబడుతుంది. హిందూ మతంతో పాటు, ఇతర మతాల వారు కూడా దీపావళి జరుపుకుంటారు. దీపావళి రోజున రాత్రి సమయంలో లక్ష్మీ దేవిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సాధారణంగా సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవిని ఎప్పుడైనా పూజించవచ్చు. అయితే దీపావళి రోజున లక్ష్మీదేవిని రాత్రి సమయంలో మాత్రమే పూజిస్తారు. అయితే దీపావళి పండగ సమయంలో మాత్రం లక్ష్మిపూజను రాత్రి సమయంలో మాత్రమే ఎందుకు చేస్తారో తెలుసా?

ప్రతి సంవత్సరం దీపావళి రోజున, లక్ష్మీ దేవి పూజ ఎల్లప్పుడూ రాత్రి లేదా సూర్యాస్తమయం తర్వాత జరుపుకుంటారు. దీని వెనుక మతపరమైన, పౌరాణిక, జ్యోతిషశాస్త్ర కారణాలు ఉన్నాయి, ఇవి ఈ సంప్రదాయాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. ఇతర రోజులలో లక్ష్మీ దేవిని ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా పూజించవచ్చు. అయితే దీపావళి రోజున మాత్రం సూర్యాస్తమం తర్వాత పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పురాణ మత గ్రంధాల ప్రకారం లక్ష్మీ పూజను ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం తర్వాత చేయాలి.

మత విశ్వాసం ఏమిటంటే

ఇవి కూడా చదవండి

హిందూ మత విశ్వాసాల ప్రకారం, రాత్రి సమయం లక్ష్మీదేవికి ఇష్టమైన సమయం. దీపావళి రోజున అమావాస్య తిధి. అంటే చంద్రుడు కనిపించడు.. చాలా చీకటిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దీపావళి రోజు రాత్రి సమయంలో ఇళ్లలో దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. లక్ష్మీదేవిని ‘కాంతి’కి చిహ్నంగా భావిస్తారు. రాత్రి సమయంలో దీపం వెలిగించడం అంటే అజ్ఞానం తొలగి జ్ఞానంవైపు పయనం.. చీకటి నుంచి వెలుగుకి ప్రయాణం అనే సందేశాన్ని పంపుతుంది.

పురాణ విశ్వాసం ఏమిటంటే
పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించింది. అప్పటి నుంచి దీపావళి రోజున లక్ష్మీదేవిని పుజిస్తారు. సముద్రాన్ని మథనం చేసే ఈ సంఘటన కూడా రాత్రి సమయంలో జరిగిందని..ఈ కారణంగా రాత్రి సమయం లక్ష్మీ పూజకు మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూమిలో సంచరిస్తుందని, ప్రకాశవంతంగా, శుభ్రంగా ఉన్న ఇళ్లలో మాత్రమే నివసిస్తుందని పురాణాల నమ్మకం.

జ్యోతిష్య దృక్పథం ఏమిటి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడానికి అనుకూలమైన సమయం అమావాస్య తిధిలో సూర్యాస్తమం తర్వాత.. దీనిని ప్రదోష కాలం అంటారు. సూర్యాస్తమయం నుంచి దాదాపు మూడు గంటల పాటు ప్రదోషకాలం ఉంటుంది. ఈ సమయం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది సానుకూల శక్తి ప్రవహించే సమయం. ప్రదోష కాలంలో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయి. కనుక ఈ సమయానికి లక్ష్మీదేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)