Dhanurmasa Special: నేడు ధనుర్మాసం చివరి రోజు.. 30 పాశురాలను పాడి రంగనాథుడిని భర్తగా పొందిన భోగి రోజు..

| Edited By: Anil kumar poka

Jan 14, 2022 | 1:31 PM

Dhanurmasa Special: ధనుర్మాసంలో ౩౦వ రోజు. ఆండాళ్ అమ్మాళ్ సాక్షాత్తు శ్రీ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి ఈ మాసంలో (Dhanurmasa) వ్రతమాచరించిన చిట్ట చివరి రోజు..

Dhanurmasa Special: నేడు ధనుర్మాసం చివరి రోజు.. 30 పాశురాలను పాడి రంగనాథుడిని భర్తగా పొందిన భోగి రోజు..
Tiruppavai 30th Pashuram
Follow us on

Dhanurmasa Special: ధనుర్మాసంలో ౩౦వ రోజు. ఆండాళ్ అమ్మాళ్ సాక్షాత్తు శ్రీ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి ఈ మాసంలో (Dhanurmasa) వ్రతమాచరించిన చిట్ట చివరి రోజు. ఈ నెల రోజులూ శ్రీకృష్ణుడిని పూజిస్తూ.. ముఫై పాశురాలను రచించింది. ఈ పాశురాలను తిరుప్పావై (Tiruppavai) అని అంటారు. ఈ రోజు తిరుప్పావై లోని చివరి 30 వ పాశురం (pashuram). నేటి  పాశురంలో శ్రీకృష్ణుడిని శరణగతి కోరుతూ.. చిట్టచివరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తె ననీ, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందనీ చెప్పింది. ఈరోజు ధనుర్మాసంలో 30 వ పాశుర‌ము, దాని అర్ధం తెలుసుకుందాం.

30. పాశురము

వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై
తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ శెన్నిరైఞ్జి
అఙ్గప్పరై కొణ్డువాత్తై, అణిపుదువై
పైఙ్గమల త్తణ్డైరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇఙ్గప్పరిశురై ప్పారీరరణ్డు మాల్వరైత్తోళ్
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

అర్ధం: శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని తాను కూడా ఆచరించి రంగానాధుడిని భర్తగా పొందింది గోదాదేవి. ఓడలతో నిండియున్న క్షీరసముద్రాన్ని మథించి లక్ష్మీదేవిని పొందిన శ్రీ మహావిష్ణువు… బ్రహ్మరుద్రులకు కూడ నిర్వాహకుడైనవానిని, ఆనాడు రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్షణాభరణములను దాల్చినవారును అగు గోపికలు చేరి, మంగళము పాడి, ‘పర’ యను వాద్యము లోకుల కోసం, భవద్దాస్యాన్ని తమకోసం పొందారు. ఆ ప్రకారం నంతను, లోకమునకు ఆభరణమైయున్న శ్రీ విల్లి పుత్తూరులో అవతరించి, సర్వదా తామరపూసలమాలను మెడలో ధరించియుండు శ్రీ భట్టనాథుల పుత్రిక యగు గోదాదేవి ద్రావిడభాషలో ముప్పది పాశురములలో మాలికగా కూర్చింది.

ఎవరైతే ఈ 30 పాశురములను క్రమము తప్పక చదువుతారో, వారు ఆనాడు గోపికలా శ్రీకృష్ణునినుండి పొందినఫలమును, గోదాదేవి వ్రతము నాచరించి పొందిన ఫలము పొందుతారు. కేవలము అధ్యయనము చేయుటచేతనే, పుండరీకాక్షుడను, పర్వతశిఖరముల వంటి బాహుశిరస్సులు గలవాడును, శ్రీ వల్లభుడును, చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాదించును.

Also Read:

Horoscope: భోగ భాగ్యాల భోగి రోజున.. ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే..