December 2021 Festivals: డిసెంబర్ నెలలో వచ్చే హిందువు పండగలు, వ్రతాలు.. వివరాలు మీకోసం

|

Nov 30, 2021 | 2:07 PM

December 2021 Festivals: ఇంగ్లీషు క్యాలెండర్‌లో డిసెంబర్ నెల.. సంవత్సరం చివరి నెల. హిందూ మాసం మార్గశిరమాసం కూడా ఈ నెలలోనే వస్తుంది. ప్రతి నెలలాగే ఈ మాసంలోనూ అనేక ఉపవాసాలు, పండుగలు వస్తాయి. ముఖ్యంగా వివాహ పంచమి, వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి వంటి పండగలకు ప్రసిద్ధి. డిసెంబర్ నెలలో ముఖ్యమైన పండుగలు..

1 / 7
ఈ నెల 2వ తేదీన మాస శివరాత్రి వస్తుంది అంతేకాదు ఇదేరోజు శివుడిని పూజిస్తూ ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ నెలలో డిసెంబర్ 2, డిసెంబర్ 17 తేదీల్లో భక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. కోరికలు తీర్చే వ్రతంగా భక్తులు భావిస్తారు.

2 / 7
డిసెంబర్ 4వ తేదీన మార్గశిరం అమావాస్య.. ఈరోజున పెద్దలకు కర్మలను నివహించడం.. పుణ్య నదుల్లో స్నానమాచరించడం ఆనవాయితీగా వస్తుంది.

3 / 7
ఈనెల 8వ తేదీన వివాహ పంచమిగా జరుపుకుంటారు. ఈరోజు సీతారాముల కళ్యాణం జరిగిందని భక్తుల విశ్వాసం. ఈరోజున పెళ్లికానివారు వ్రతాన్ని ఆచరిస్తే.. మంచి ఫలితం ఉంటుందని భావిస్తారు.

4 / 7
ఈనెల 14న హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత జయంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది గీత 5158వ వార్షికోత్సవం జరగనుంది. అంతేకాదు మోక్ష ఏకాదశి గా భావించి విష్ణుమూర్తిని పూజిస్తారు.

5 / 7
ఈనెల 19న మార్గశిర మాసం పున్నమి వచ్చింది. ఈరోజున ప్రజలు ఉపవాసం ఉంటారు, అలాగే పవిత్ర నదులలో స్నానంచేసి దానం వంటి కార్యక్రమాలని నిర్వహిస్తారు. అంతేకాదు ఎక్కువమంది హిందువులు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు.

6 / 7
ఈ నెల సంకష్ట చతుర్థి డిసెంబర్ 22 బుధవారం వచ్చింది. ఈరోజు గణేశుడిని పూజిస్తారు. పగలు ఉపవాసం ఉంది.. రాత్రి చంద్రుడి దర్శానఁ చేసుకున్న తర్వాత ఆహారం తీసుకుంటారు. ఇలా చేయడంవలన జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం

7 / 7
పుష్యమాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీన వస్తుంది. ఈరోజు విష్ణువుని పూజిస్తూ వ్రతాన్నిఆచరించడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులతో భక్తుని కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.