Kanipakam Temple: వివాదాలకు ఆలయంగా మారిన కాణిపాకం.. భక్తుల ఇచ్చే కానుకలకు రశీదు ఇవ్వకపోవడంపై రచ్చ..

మరో దాత ఇచ్చిన కానుకపై వివాదం వెలుగు చూసింది. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీమనికంఠేశ్వర టెంపుల్‌కి విజయలక్ష్మి అనే భక్తురాలు కానుకలు ఇచ్చింది. రశీదు ఇవ్వక పోవడంతో ఆలయ ఉప ప్రధాన అర్చకులపై ఆరోపణలు వచ్చాయి.

Kanipakam Temple: వివాదాలకు ఆలయంగా మారిన కాణిపాకం.. భక్తుల ఇచ్చే కానుకలకు రశీదు ఇవ్వకపోవడంపై రచ్చ..
Varasiddhi Vinayaka Swamy Temple

Updated on: Nov 26, 2022 | 6:57 AM

విజ్ఞాన అధిపతి కొలువైన వినాయకుడి చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. భక్తుల ఇచ్చే కానుకలకు రశీదులు ఇవ్వక పోవడం రచ్చగా మారుతోంది. ఇందులో అర్చకుల భాగోతం, అధికారుల అలసత్వం విమర్శలకు తావిస్తోంది. అయితే.. ఈ మధ్యనే అలర్ట్‌ ఐన పాలకమండలి అర్చకులపై సస్పెన్షన్‌ వేటు వేసి విచారణను మొదలు పెట్టింది. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయక ఆలయం.. వివాదాలకు ఆలయంగా మారింది. భక్తులు ఇచ్చిన కానుకలు, డబ్బులకు రశీదులు ఇవ్వలేదన్న రచ్చ.. కొత్త వివాదంలోకి లాగింది. ఇప్పటికే పలు వివాదాల్లో మునిగి పోయిన టెంపుల్‌.. తాజాగా కొత్త కాంట్రవర్సీలో చేరింది. మహాకుంభాభిషేకం నడుస్తున్న సమయంలో.. వేలూరు గోల్డెన్‌ టెంపుల్‌ వ్యవస్థాపకులు నారాయణి అమ్మన్‌ స్వామి కానుకలు ఇచ్చారు. స్వామి వారికి ఇచ్చిన బంగారు విబూది పట్టీకి రశీదు ఇవ్వలేదు. ఈ విషయాన్ని దాత బయట పెట్టడంతో గొడవ మొదలయింది.

ఆలస్యంగా తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆలయం అధికారులకు మెమోలు ఇచ్చారు. ఆలయం ఉప ప్రధాన అర్చకులు ధర్మేష్‌ గురుకుల్‌ను సస్పెండ్‌ చేసింది. దీనిపై విచారణ కొనసాగుతుండగానే మరో దాత ఇచ్చిన కానుకపై వివాదం వెలుగు చూసింది. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీమనికంఠేశ్వర టెంపుల్‌కి విజయలక్ష్మి అనే భక్తురాలు కానుకలు ఇచ్చింది. రశీదు ఇవ్వక పోవడంతో ఆలయ ఉప ప్రధాన అర్చకులపై ఆరోపణలు వచ్చాయి. రశీదులు ఇచ్చామన్న ఈవో వెంకటేశ్… విజయలక్ష్మి ఉభయదారు కాదని దాతగానే కానుకలు ఇచ్చిందన్నారు.

ఈ వవ్యహారం పెద్ద చర్చకే దారి తీసింది. ఇప్పటికే టెంపుల్‌ ఉప ప్రధాన అర్చకులు ధర్మేశ్‌ గురుకుల్‌ను సస్పెండ్‌ చేసింది. మరో ఉప ప్రధాన అర్చకులు సోమశేఖర స్వామిపై విచారణకు ఆదేశించారు. అటు.. కానుకలు ఇచ్చిన దాతలు అధికారులపై విమర్శలు చేస్తున్నారు. రశీదులు ఇచ్చామంటున్న ఆలయ అధికారులు సత్యప్రమాణం చేయాలంటున్నారు దాత విజయలక్ష్మి. భక్తి భావంతో సమర్పించే కానుకలకు జవాబుదారి ఉండాలంటున్నారు భక్తులు.
ఆలయంలో జరుగుతున్న వవ్యహారంపై లోతైన విచారణ జరిగితేనే బండారం అంతా బయట పడుతుందంటున్నారు భక్తులు. ఇలా కాణిపాకం ఆలయంలో వరుస వివాదాలు భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసేలా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..