చంద్రగ్రహణం గొప్ప శాస్త్రీయ, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది పలు రాశుల వారి జీవితాలపై చంద్రగ్రహణం ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఈ సంవత్సరం ఇప్పటికే సూర్య, చంద్రగ్రహణాలు సంభవించాయి. త్వరలో మరో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి. 2023 సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం అక్టోబరు 29, ఆదివారం నాడు ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించనుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5న ఏర్పడింది. అలాగే, సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం 29 అక్టోబర్ 2023న జరుగుతుంది. మతపరంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. గ్రహణం ప్రభావం కడుపులో పెరుగుతున్న పిల్లలపై పడుతుందని నమ్ముతారు. ఈ చంద్రగ్రహణం చాలా రకాలుగా ఉంటుంది.
చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?
భూమి సూర్యచంద్రుల చుట్టూ తిరుగుతుందని అందరికీ తెలుసు. రెండూ తమ స్వంత కక్ష్యలను కొనసాగిస్తాయి. అయితే భూమి, సూర్యుడు, చంద్రుడు సరళ రేఖలో వచ్చినప్పుడు. అప్పుడు చంద్రుడు పూర్తిగా కప్పబడి ఉంటాడు. దీని వల్ల సూర్యకాంతి చంద్రునిపైకి చేరదు. దీని వల్ల చంద్రుడు కనిపించడు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు, సూర్యుడు, చంద్రుడు, భూమి చాలా సార్లు సరళ రేఖలో ఉంటాయి. ఖగోళ శాస్త్రం ప్రకారం, సూర్యుడు, చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కానీ, చంద్రగ్రహణం, దాని ప్రభావాలు రెండూ వేర్వేరు పరిస్థితుల కారణంగా ప్రతిసారీ మారుతూ ఉంటాయి. అంతేకాదు… చంద్రగ్రహణాలు మూడు రకాలు. వీటిని సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, పెనుంబ్రల్ చంద్రగ్రహణం అంటారు.
చంద్రగ్రహణం ప్రభావం ఎలా ఉండనుంది..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సంపూర్ణ చంద్రగ్రహణం నుండి పాక్షిక, నీడ వరకు, రాశులు, గ్రహాల ప్రభావం పడిపోతుంది. ఇది ఆ వ్యక్తి, గర్భిణీ స్త్రీల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో గర్భిణీలు చంద్రగ్రహణం నాడు రాత్రంతా మేల్కొని ఉండాలని నమ్ముతారు. ఈ సమయంలో భగవంతుని ధ్యానించాలని చెబుతారు. కడుపులో పెరుగుతున్న బిడ్డపై నిద్ర చెడు ప్రభావం చూపుతుందని నమ్ముతారు.
చివరి చంద్రగ్రహణం సమయం ఎప్పుడంటే..
ఇకపోతే, 2023 అక్టోబర్‌లో ఏర్పడబోయే రెండవ, చివరి చంద్రగ్రహణం అశ్వినీ అమవాస్య రోజు ఏర్పడబోతుంది. ఇది అక్టోబర 28నాడు అర్ధ రాత్రి 1:06 గంటలకు ప్రారంభమై 2:22 గంటలకు ముగుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహణం వ్యవధి 1 గంట 16 నిమిషాలు. ఇప్పుడు ఏర్పడబోయేది పాక్షిక చంద్రగ్రహణం అంటారు. ఇది భారతదేశంలో కూడా కనిపిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంతోపాటు యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా, ఆర్కిటిక్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రం మరియు ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఈ గ్రహణం ప్రభావం మొత్తం 12 రాశులవారిపై ప్రభావం చూపనుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..