AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ మూడు విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఎంతటి శత్రువైనా మోకరిళ్లాల్సిందే..

Chanakya Niti: జీవితంలో పెద్ద లక్ష్యాలను కలిగి ఉన్న వ్యక్తులు వాటిని సాధించే దిశగా అడుగులు వేస్తుంటారు.

Chanakya Niti: ఈ మూడు విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఎంతటి శత్రువైనా మోకరిళ్లాల్సిందే..
Chanakya
Shiva Prajapati
|

Updated on: Jan 19, 2022 | 9:02 AM

Share

Chanakya Niti: జీవితంలో పెద్ద లక్ష్యాలను కలిగి ఉన్న వ్యక్తులు వాటిని సాధించే దిశగా అడుగులు వేస్తుంటారు. ఈ క్రమంలో తమకు ఎదురయ్యే ఆటంకాలను వారు ఏమాత్రం లక్ష్య పెట్టరు. ముఖ్యంగా ఇలాంటి వారు తమ శత్రువులకు ఏమాత్రం భయపడరు. ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా తమ ప్రతిభను మరింత మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తద్వారా వారు ఏ పరిస్థితిలోనైనా తమ శత్రువులను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు. వాస్తవానికి, కష్టపడి పనిచేయడానికి, ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపించేది మీ శత్రువులే. అందువల్ల, మీరు మీ లక్ష్యాన్ని సాధించడం ద్వారా శత్రువుపై విజయం సాధించినట్లు అవుతుంది. అయితే, శత్రువుపై విజయం సాధించాలంటే.. కొన్ని కీలక విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలేంటో ఆచార్య చాణక్య మరింత క్లారిటీగా చెప్పారు. ఆచార్య చాణక్య చెప్పిన మూడు విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1. నీ శత్రువు బలం నీకంటే తక్కువ కాదు.. చాణక్యుడి ప్రకారం.. శత్రువును ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఎదుటి వారికి వారికి పోటీపడే శక్తి కలిగి ఉండొచ్చు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ప్రత్యర్థిని, శత్రువును తక్కువగా అంచనా వేయడం వంటి తప్పు చేస్తే, మీరు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఓడిపోతారు. అయితే, మీరు మీ ప్రత్యర్థిని స్వంత వ్యక్తిగా లేదా, మీకంటే బలమైన వ్యక్తిగా పరిగణనిస్తూ వారిలో ఒకరకమైన భావన ప్రేరేపించాల్సి ఉంటుంది. అలా వారి ప్రతీ అడుగును అంచనా వేసేందుకు అవకాశం లభిస్తుంది. మీ ప్రత్యర్థిని సులభంగా ఎదుర్కోవచ్చు.

2. కోపం తగదు.. కోపం మనిషికి అతి పెద్ద శత్రువు అని చాణక్యుడు చెబుతారు. కోపంలో, ఒక వ్యక్తి తరచుగా ఏదో ఒక తప్పు చేస్తాడు. కొన్నిసార్లు శత్రువులు మీకు కోపం తెప్పించడం ద్వారా తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తారు. అలాంటి పరిస్థితిలో మీరు వారి మాటలలో చిక్కుకుంటే, కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. అందుకన, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోండి. ఏ నిర్ణయమైనా ప్రశాంత చిత్తంతో ఆలోచించి తీసుకోండి. అప్పుడే మీరు ఏ సందర్భంలో ఎలాంటి ఆట ఆడాలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు.

3. సహనం తప్పనిసరి.. మీ లక్ష్యం పెద్దదైతే, దాన్ని చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ క్రమంలో ఓపిక అవసం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని కోల్పోవద్దు. జీవితంలో చాలా సార్లు నేర్చుకునే ప్రక్రియలో ఓటమిని ఎదుర్కొంటుంటారు. అలాంటి పరిస్థితిలో మీరు ఎక్కడ తప్పు చేశారో, ఏ కారణంతో ఓడిపోతున్నారనేది పరిశీలించుకోవాలి. ఓపికతో పరిస్థితిని అంచనా వేయాలి. తదుపరి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. నిరంతరం లక్ష్యం వైపు కదులుతూ ఉండండి. మీ లక్ష్య సాధనే.. మీ శత్రువుపై మీరు సాధించే విజయం.

Also read:

Corona RTPCR Test: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. కోవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ ధర తగ్గింపు..!

Ram Gopal Varma: మనసులో మాట చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. బాలయ్య ఒప్పుకుంటారా?

పింక్ బాల్‌ టెస్ట్‌ అంటే ఏమిటి ?? గ్లెన్‌ మెక్‌గ్రాత్‌కు ఈ టెస్ట్‌కు సంబంధం ఏంటి ?? వీడియో

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు