
జీవితం, రాజకీయాలు, ప్రవర్తనపై ఆచార్య చాణక్యుడు రాసిన నీతి సూత్రాలు వేల సంవత్సరాల క్రితం ఎంత సందర్భోచితంగా ఉన్నాయో నేటికీ అంతే సందర్భోచితంగా ఉన్నాయి. ఆయన విధానాలు రాజ్య పాలన చేసే రాజులకు మాత్రమే కాదు.. సామాన్య ప్రజల జీవితాలకు కూడా మార్గదర్శకంగా ఉన్నాయి. మనిషి పతనం రెండు కారణాల వల్ల జరుగుతుందని చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. ఈ రెండు కారణాలను అర్థం చేసుకోవడం, వాటిని నివారించడం విజయానికి నిజమైన కీలకం అని చెప్పాడు.
మొదటి కారణం: దురాశ
చాణక్య నీతి ప్రకారం దురాశ మనిషికి అతిపెద్ద శత్రువు. ఒక వ్యక్తి తనకు ఉన్న సాధనాలు, సుఖాలతో సంతృప్తి చెందకుండా.. మరింత పొందాలనే కోరికతో తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే.. అతని పతనం ఖాయం. దురాశ కారణంగా, మనిషి ఏది సరైనది, ఏది తప్పు అనే వ్యత్యాసాన్ని మరచిపోతాడు. అందుకే చాణక్య దురాశను పతనానికి మొదటి అడుగు అని పిలిచాడు.
రెండవ కారణం: అహంకారం
అహంకారం ఒక వ్యక్తి తెలివితేటలను కప్పివేస్తుంది. ఒక వ్యక్తి తన జ్ఞానం, శక్తి లేదా సంపద కారణంగా ఇతరులను తక్కువ వారిగా పరిగణించడం ప్రారంభించినప్పుడు అతని పతనం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. అహంకారి అయిన వ్యక్తి తన సన్నిహిత సహచరులు, స్నేహితుల నుంచి కూడా తనను తాను దూరం చేసుకుంటాడని చాణక్య నీతి పేర్కొంది. చివరికి సహకారం, మద్దతు ముగిసినప్పుడు ఆ వ్యక్తి పతనం అనివార్యం అవుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు