Chanakya Niti: ఇలాంటి లక్షణాలున్న తల్లిదండ్రులు.. పిల్లలకు శత్రువుల వంటివారు అంటున్న చాణక్య

|

Apr 14, 2022 | 7:33 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) ఏ పిల్లలకైనా మొదటి విద్య తన తల్లిదండ్రుల నుండి ప్రారంభమవుతుందనినమ్మాడు. తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం వారి..

Chanakya Niti: ఇలాంటి లక్షణాలున్న తల్లిదండ్రులు.. పిల్లలకు శత్రువుల వంటివారు అంటున్న చాణక్య
Chanakya Neeti
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) ఏ పిల్లలకైనా మొదటి విద్య తన తల్లిదండ్రుల నుండి ప్రారంభమవుతుందనినమ్మాడు. తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం వారి జీవితాంతం పిల్లలతో పాటు సాగుతుంది. దీని ఆధారంగానే  పిల్లల వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విద్య , విలువలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ పిల్లలు సరైన మార్గంలో వెళ్తే.. పిల్లలు తమ బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా.. తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తారు. అయితే ఒక్కోసారి తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు పిల్లల భవిష్యత్తును పాడుచేస్తున్నాయి. అటువంటి తల్లిదండ్రులనుపిల్లలకు శత్రువులుగా ఆచార్య చాణక్యుడు భావించాడు. ఏ తల్లిదండ్రులు చేయకూడని తప్పుల గురించి ఈరోజు తెలుసుకుందాం..

తల్లిదండ్రులు తమ పిల్లలను ఎల్లప్పుడూ సద్గుణ సంపన్నుల్లా పెంచాలని.. వారిని సత్ప్రవర్తనతో నడిచేలా  తీర్చిదిద్దాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అలాంటి పిల్లలు కుటుంబం పేరును మరింత ప్రకాశింపజేస్తారు. మంచి విత్తనాలు నాటితే మంచి ఫలాలు కూడా వస్తాయి.  పిల్లల మనసులో తప్పుడు ఆలోచనలు వచ్చేలా చేయవద్దు. మీ ఉద్దేశ్యం లేదా ఏదైనా కోరికను నెరవేర్చడానికి పిల్లలపై ఎలాంటి ఒత్తిడి చేయవద్దు. మీ స్వంత ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్పడం వారికి నేర్పించవద్దు. ఈరోజు చెప్పే అబద్ధం రేపు పిల్లల భవిష్యత్ పై ప్రభావం చూపిస్తుంది. మీరు పిల్లలలో మంచి లక్షణాలను పెంపొందిస్తే.. రేపు ఆ పిల్లలు.. తల్లిండ్రులకు పేరు ప్రఖ్యాతలు వచ్చేలా చేస్తారు. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్లో సత్ప్రవర్తనను అలవర్చాలి.

ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి రెండవ అధ్యాయంలో పిల్లల విద్య గురించి రాశారు. పిల్లల చదువును సీరియస్‌గా తీసుకోని తల్లిదండ్రులు, చదువుపై శ్రద్ధ పెట్టని తల్లిదండ్రులు బిడ్డకు శత్రువులాంటి వారు. నిరక్షరాస్యులైన పిల్లలు భవిష్యత్తులో నాగరిక సమాజంచే తృణీకరించబడతారని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో పిల్లల్లో విశ్వాసం కూడా సన్నగిల్లుతుంది. అంతేకాదు చదువు లేని పిల్లలు స్థానం హంసల మందలో కొంగ వంటిదని పేర్కొన్నాడు.

ఆచార్య చాణక్యుడు పిల్లలకు మితిమీరిన ప్రేమ, ఆప్యాయత ఇవ్వకూడదని నమ్మాడు. ఇలా చేయడం వల్ల పిల్లలు మొండిగా తయారవుతారు. అంతేకాదు అలాంటి పిల్లలు తమ మనస్సుకు అనుగుణంగా ప్రతిదీ చేయడం అలవాటు చేసుకుంటారు. తరువాత, ఈ అలవాటు వారిని నిరంకుశంగా చేస్తుంది. ఈ నిరంకుశత్వం పిల్లలకు మంచి చేయదు. అంతేకాదు అటువంటి పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వలేరు. అందుచేత, పిల్లలు తప్పు చేస్తే.. తప్పని సరిగా దండించాలి. తద్వారా వారు తప్పు, తప్పు ఒప్పుల మధ్య తేడాను అర్థం చేసుకోగలరు. దీంతో వారిలో మంచి లక్షణాలు వృద్ధి చెందుతాయి.

Also Read: Viral Video: పెళ్లి కూతురు వేషంలో కచ్చా బాదం సాంగ్ ను పాడిన రేణు మండల్.. నెట్టింట్లో వైరల్..