Chanakya Niti: ఈ రకాల వ్యక్తులు పాములా విషపూరితమైనవారు.. కలలో కూడా నమ్మవద్దు అంటున్న చాణక్య ..

|

Feb 09, 2022 | 3:01 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడి (Acharya Chankudu) ఆర్థిక శాస్త్ర వేత్త, గొప్ప పండితుడు. తన తెలివితేటలతో  చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యానికి రాజుని చేసాడు. ఆచార్య చాణక్యుడి తన అనుభవాలను..

Chanakya Niti: ఈ రకాల వ్యక్తులు పాములా విషపూరితమైనవారు.. కలలో కూడా నమ్మవద్దు అంటున్న చాణక్య ..
Chanakya Niti
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడి (Acharya Chankudu) ఆర్థిక శాస్త్ర వేత్త, గొప్ప పండితుడు. తన తెలివితేటలతో  చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యానికి రాజుని చేసాడు. ఆచార్య చాణక్యుడి తన అనుభవాలను నీతి శాస్త్రంగా రచించాడు. ఇందులో స్నేహితుల నుండి శత్రుత్వం వరకు, భార్య నుండి వ్యాపారం వరకు అందరి గురించి ప్రస్తావించారు. ఆచార్య చాణక్యుడు ప్రతి ఒక్కరి జీవితంలో కొంతమందైనా నమ్మదగిన వ్యక్తులు ఉండాలని, వారి నుండి ఎటువంటి హాని జరగదని చెప్పాడు. అయితే అదే సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో పాముల వంటి విషపూరితమైన వ్యక్తులను  చాలాసార్లు ఎదుర్కోవాల్సి వస్తుందని..ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఈ  రకాల వ్యక్తులను ఎప్పుడూ విశ్వసించకూడదని, అలాంటి వారితో ఎప్పుడూ బాధలను పంచుకోకూడదని చెప్పాడు.

ఆచార్య చాణక్యుడు ఈ ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారని.. వీరు వ్యక్తి సమస్యలను అర్థం చేసుకోలేరని చెప్పారు. అంతేకాదు  ఇతరుల బాధలను పట్వాటించుకోని వారు కూడా ఉన్నారని .. ఎక్కువగా గ్రామస్తులను ఇబ్బందులకు గురిచేసే వారుకూడా ఇతరుల కష్టాలను చూసి బాధపడరని అన్నాడు చాణక్య.

అంతేకాదు ఎవరైనా సరే తన బాధను ఇతరులతో పంచుకోకూడదని చాణక్య  చెప్పారు. ఎందుకంటే వారికి తమ బాధలను చెప్పడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఇక కొంతమంది వ్యక్తులను ఎదుర్కొన్నప్పుడు, సహనంతో , అవగాహనతో వ్యవహరించాలని, అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిదని ఆచార్య చాణక్యుడు నమ్మాడు.

పాము విషం దాని కోరల్లో ఉంటుంది, ఈగకు దాని తలలో , తేలు దాని తోకలో ఉంటుంది. అంటే.. అన్ని విష జీవులు  ఏదోక భాగంలో విషాన్ని కలిగి ఉంటాయి. కానీ మనస్సులో చెడు ఆలోచనలు ఉన్న వారి అవయవాలన్నీ విషంతో నిండి ఉంటాయి. అలాంటి వారు తమ విషాన్ని ఇతరులపై చిమ్ముతూనే ఉంటారు. కనుక ముర్ఖుడికి, చెడు ఆలోచనలు ఉన్నవారికి దూరంగా ఉండడం మంచిది అని చాణక్య చెప్పారు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:  థర్డ్ వేవ్ ముగిసింది… నిద్రలేమి, బ్రెయిన్ ఫాగ్ వంటి పోస్ట్ కోవిడ్ కేసులతో ఇబ్బందిపడుతున్న బాధితులు