Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Chanakya)రచించిన నీతి శాస్త్రం (Niti Sastra)నేటి మానవులకు అనేక జీవిన విధానాలను నేర్పుతుంది. వాటిని ఆచరిస్తే.. ఆ మనిషిజీవితం ఏ కలతలు, కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని పెద్దల నమ్మకం.. ఒక వ్యక్తి నిరంతరం కష్టపడి .. శ్రమించి లక్ష్యాన్ని సాధించినప్పుడు, అతని శత్రువులు కూడా అతనిని ప్రశంసించవలసి వస్తుంది. ఒక వ్యక్తి తనపై తాను పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి.
ఆచార్య చాణక్యుడు విజ్ఞానం, నైపుణ్యంతో సంస్కారవంతులుగా మనుషులు ఉండాలని చెప్పారు. జ్ఞానం, నైపుణ్యం కలిగిన వ్యక్తులు సంస్కారం కలిగి ఉండి పదిమంది మన్ననలను పొందుతారు. అలాంటి వారికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది.
అలాంటి వ్యక్తులు ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తారు. మరికొందరు దాని నుండి ప్రేరణ పొందుతారు. దేశాన్ని పటిష్టం చేయడంలో సంస్కారవంతులు కీలక పాత్ర పోషిస్తారు
ఆచార్య చాణక్యుడు ప్రతి వ్యక్తి జ్ఞానాన్ని కలిగి ఉండాలని సూచించారు. జ్ఞానంతో ఉన్న వ్యక్తిపై సరస్వతి అనుగ్రహం ఉంటుంది. అన్ని రకాల చీకట్లను పారద్రోలే శక్తి జ్ఞానానికే ఉంది. ఆ జ్ఞానాన్ని నలుగురితో పంచుకోవడం ద్వారా మరింతగా జ్ఞానం పెరుగుతుంది. అందువల్ల, జ్ఞానం ఎక్కడ నుంచి లభించినా ఎవరు చెప్పినా సరే తీసుకోవాలి
ఒక వ్యక్తి తన జ్ఞానంతో పాటు నైపుణ్యాన్ని కూడా పెంచుకుంటూ పోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ప్రతి ఒక్కరికి నైపుణ్యం అవసరం. ఏ పనినైనా చేయగల ప్రత్యేక నైపుణ్యం ఉన్నవాడు, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల రక్షణను పొందుతాడు. అటువంటి వ్యక్తులు అభివృద్ధిలో వారి ముఖ్యమైన సహకారాన్ని అందిస్తారు.
Also Read: