
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ వద్దకు వచ్చిన ఓ మహిళా భక్తురాలు.. ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండటం సాధ్యమేనా? అని అడిగింది. ఈ ప్రశ్న కేవలం ఆసక్తికరమైనదే కాదు.. లోతైన భావోద్వేగం, మమకారం నిండి ఉన్నది. చాలా మంది భాగస్వాములు వచ్చే జన్మలో కూడా వారే తమకు భార్య లేదా భర్తగా రావాలని కోరుకుంటూ ఉండటం వినే ఉంటాం. కానీ, దీనిపై ప్రేమానంద్ మహారాజ్ సమాధానం ఇప్పుడు చూద్దాం.
ఒక జన్మలో భార్యాభర్తల కలయిక వారి వ్యక్తిగత కర్మలు, సంచిత కర్మ, విధిపై ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో భార్యా లేదా భర్త అయిన వ్యక్తి తదుపరి జన్మలో అదే రూపంలో లేదా మానవ రూపంలో కూడా జన్మించే అవకాశం ఉండవచ్చు లేకపోవచ్చు. కర్మ నియమం చాలా సూక్ష్మమైనది, లోతైనది.. కేవలం భావోద్వేగాల ద్వారా మార్చబడదని ప్రేమానంద్ మహారాజ్ స్పష్టం చేశారు.
అయితే, అసాధ్యమని అనిపించే ఈ ప్రశ్న కూడా దేవుని దయ వల్ల సాధ్యం కావచ్చని స్వామిజీ అంటున్నారు. ఒక పురుషుడు లేదా స్త్రీ తనను తాను దేవునికి అంకితం చేసుకుని.. పూర్తి అంకితం భావంతో అదే భాగస్వామి తనతో ఏడు జన్మలపాటు ఉండేలా వరం కోరితే.. దేవుడి అనుగ్రహంతో అది సాధ్యం కాగలదు. విశ్వ సృష్టికర్తకు అసాధ్యం అనేది లేదు అని ప్రేమానంద్ మహారాజ్ వివరించారు.
కర్మ లేదా విధిపై మాత్రమే ఆధారపడటం వల్ల తదుపరి జీవితంలో ఒకే జీవిత భాగస్వామి ఉంటారని హామీ ఇవ్వలేము. దీని కోసం కఠినమైన భక్తి, తపస్సు, దేవుని కోసం ప్రత్యేకమైన ఆరాధన అవసరం. భక్తి జీవితానికి కేంద్రంగా మారినప్పుడు మాత్రమే.. దేవుడు తన అనుగ్రహంలో ప్రత్యేక కృపను ప్రసాదిస్తాడు అని ప్రేమానంద్ మహారాజ్ వివరించి చెప్పారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు. )