AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీపురుని ఇంట్లో ఈ దిక్కున ఉంచితే.. లక్ష్మీ దేవి మీ ఇంట్లోనే ఉంటుంది.. ఈ పొరపాట్లు చేశారో..

సనాతన ధర్మంలో చీపురుకు విశేష ప్రాధాన్యత ఉంది. దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు, అలాగే శనైశ్చరుడి ఆయుధాల్లో ఒకటిగా కూడా చెబుతారు. చీపురు ఇంటిని శుభ్రం చేస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి దీనిని గౌరవించడం ముఖ్యం. చీపురును కాలితో తన్నడం, దానిపై కాలు రాయడం వంటివి చేయకూడదు.

చీపురుని ఇంట్లో ఈ దిక్కున ఉంచితే.. లక్ష్మీ దేవి మీ ఇంట్లోనే ఉంటుంది.. ఈ పొరపాట్లు చేశారో..
Broom Vastu Tips
Shaik Madar Saheb
|

Updated on: May 12, 2026 | 7:56 PM

Share

హిందూ ధర్మం (సనాతన ధర్మం) లో ప్రతి వస్తువును భగవత్స్వరూపంగా భావిస్తారు. ఆ కోవలోనే చీపురును కూడా లక్ష్మీదేవి స్వరూపంగా గౌరవిస్తారు. చీపురు కేవలం ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగపడే వస్తువు మాత్రమే కాదు, ఇంటి ఆరోగ్యాన్ని, శుభ్రతను కాపాడే ఒక ముఖ్యమైన సాధనం. చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా చీపురు మనకు ఎంతో సేవ చేస్తుంది. అందుకే దీనిని అగౌరవపరచకూడదని పెద్దలు చెబుతారు. చీపురును పొరపాటున కూడా కాలితో తన్నకూడదు లేదా దానిపై కాలు వేయకూడదు. ఇది శనైశ్చరుడి ఆయుధాల్లో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది.. కాబట్టి, దాని పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

చీపురును ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం ద్వారా శుభాలు కలుగుతాయని నమ్ముతారు. చీపురును ఆగ్నేయ మూలలో ఉంచడం శ్రేష్ఠమని పండితులు సూచిస్తారు. ఈశాన్య మూలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురును పెట్టకూడదు. అలాగే, చీపురును నిలబెట్టే పద్ధతి కూడా ముఖ్యమైనది. చాలామంది చీపురు కుచ్చు నేలవైపు ఉండేలా, పట్టుకునే భాగం పైకి ఉండేలా నిలబెడతారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం పట్టుకునే భాగం పైకి ఉండేలా నిలబెట్టాలి. కుచ్చు నేలవైపు ఉండటం వల్ల అది త్వరగా విరిగిపోవడం, వంగిపోవడం, ఎక్కువ కాలం పని చేయకపోవడం జరుగుతుంది. అందుకే, పట్టుకునే భాగం పైకి ఉండేలా నిలబెట్టడం లేదా గోడకు తగిలించడం మంచిది.

పల్లెటూళ్లలో పూర్వకాలంలో కొబ్బరి చీపురులు, తాటిమట్టల చీపురులు వాడుకలో ఉండేవి. ఈ చీపురులను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారుచేసేవారు. వాటిని తగిలించుకోవడానికి వీలుగా పైన ఒక హోల్డర్ లాంటిది ఉండేది. అవి దెబ్బతినకుండా ఉండేవి. ప్రస్తుతం వాడుకలో ఉన్న కొండ చీపురులు, మెత్తని చీపురులు త్వరగా పాడవుతాయి కాబట్టి వాటిని తగిలించడం ఉత్తమం. బొంబాయి వంటి ప్రదేశాలలో చాలామంది చీపురును తగిలించుకోవడానికి హుక్‌లను అమర్చుకుంటారు. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే కొన్ని ఆధునిక చీపురులకు తాడు కట్టడానికి లేదా హుక్‌లకు తగిలించడానికి వీలుగా ప్లాస్టిక్ హోల్డర్లు, రంధ్రాలు వస్తున్నాయి. దీని వల్ల చీపురు పాడవకుండా ఎక్కువ కాలం ఉంటుంది.

చీపురును నేలపై పడుకోబెట్టడం లేదా తలుపుల పక్కన అడ్డంగా ఉంచడం మంచిది కాదు. ఒకవేళ తగిలించడానికి వీలు లేకపోతే, పడుకోబెట్టడం కూడా సరికాదు కానీ, నిలబెట్టడం సాధ్యం కాని పరిస్థితులలో తాత్కాలికంగా పడుకోబెట్టవచ్చు. అయితే, చీపురును ఎప్పుడూ నిలబెట్టడమే మంచిది లేదా ఎక్కడైనా తగిలించాలి. పూర్వకాలంలో చీపురును తరచుగా ఇంటి వెనుక భాగంలో, అనగా పెరటిలోనే పెట్టుకునేవారు. ప్రస్తుతం స్థలం లేని పరిస్థితుల్లో, ఆగ్నేయ మూలలో గోడ పక్కన ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం, వీలైతే తగిలించడం ఉత్తమమైన పద్ధతి. దీని వల్ల ఇంటిలో సానుకూల శక్తి ప్రవహించి, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని విశ్వసిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

Follow Us