Kanipakam: వినాయక ఆలయంలో సేవా టికెట్ల ధరలు భారీగా పెంపు.. అధికారుల తీరుని నిరసిస్తూ బిజేపీ ధర్నా

|

Mar 25, 2022 | 2:48 PM

Kanipakam: చిత్తూరు జిల్లా( Chittoor District)లోని ప్రముఖ క్షేత్రం కాణిపాకం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి( Sri Varasiddhi vinayaka Temple) ఆలయంలో సేవా టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి..

Kanipakam: వినాయక ఆలయంలో సేవా టికెట్ల ధరలు భారీగా పెంపు.. అధికారుల తీరుని నిరసిస్తూ బిజేపీ ధర్నా
Kanipakam Temple
Follow us on

Kanipakam: చిత్తూరు జిల్లా( Chittoor District)లోని ప్రముఖ క్షేత్రం కాణిపాకం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి( Sri Varasiddhi vinayaka Temple) ఆలయంలో సేవా టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో స్వామివారి దర్శన టికెట్ల ధరలను పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాణిపాకం ఆలయం ఈవో కార్యాలయం ముందు బిజెపి నేతలు ధర్నా చేపట్టారు. ఆర్థిక సేవా టిక్కెట్ల ధరల పెంపును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆలయంలో అక్రమంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ జారీ చేయకుండా కాణిపాకం ఆలయంలో ఉద్యోగ నియామకాలు చేపట్టడాన్ని బిజెపి నేతలు తప్పుపట్టారు.

కాణిపాకంలో టికెట్ల ధర పెంపు వివరాలు: వరసిద్ధి వినాయకుడి ఆలయంలో సేవా టికెట్ల ధరలను పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గణపతి హోమం 500 రూపాయలు నుంచి 1000 రూపాయలకు పెంచారు. అంతేకాదు 2వేల రూపాయలతో కొత్తగా.. ప్రత్యేక గణపతి హోమాన్ని దేవస్థానం అందుబాటులో తీసుకొచ్చారు. అంతేకాదు స్వామివారి శీఘ్రదర్శనం టికెట్ ధర రూ. 51 నుంచి రూ. 100 లకు పెంచారు. అతి శీఘ్ర దర్శనం రూ. 100 నుంచి రూ. 150 లకు దేవస్థానం అధికారులు పెంచారు. ఈ కొత్త ధరలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి.

Also Read: Tirumala: తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు.. క్యూ లైన్లలోని భక్తులకు ఆహారం, పాలు అందించాలని ఆదేశం

Upasana Konidela: చెర్రీ భార్య ఆర్ఆర్ఆర్ థియేటర్‌లో హంగామా.. ఫ్యాన్ గర్ల్‌లా కేరింతలు కొడుతూ.. పేపర్స్ వర్షం కురిపించిన ఉపాసన