
మనిషి ఎలా జీవించాలి అనే విషయాన్ని రామాయణం చెబితే.. మనిషి ఎలా జీవించకూడదో మహాభారతం చెబుతుందని హిందువుల నమ్మకం. పంచమ వేదం మహాభారతంగా కీర్తించబడుతుంది. జీవితానికి సంబంధించిన ప్రతి అంశం గురించి ఇందులో ఉంది. కురుక్షేత్ర యుద్ధం పూర్తిగా 18 రోజులు కొనసాగింది. ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోయారు. పాండవులు విజయం సాధించారు. భీష్మ పితామహుడు మహాభారతంలో గొప్ప యోధుడు. కురు వృద్ధుడు. అంపశయ్య మీద ఉన్న బీష్మ పితామహుడు పాండవులకు ఎన్నో విషయాలను చెప్పాడు. రాజ్య పాలన, మానవుడి నడవడిక, వంటి విషయాల్లో ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించాడు. భీష్ముడు… పాండవుల మధ్యముడు అర్జునుడికి ఆహారం గురించి చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. భీష్మ పితామహుడి మాటలు నేటి కాలంలో కూడా చాలా సందర్భోచితంగా ఉన్నాయి. ఆహారం గురించి భీష్మ పితామహుడు చెప్పిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
భీష్మ పితామహుడి విధానం ప్రకారం.. కుటుంబం మొత్తం కలిసి భోజనం చేసే చోట అన్నపూర్ణ దేవి ఆ ఇంట్లో నివసిస్తుంది. ప్రేమతో వడ్డించే ఆహారం అమృతం లాంటిది. అలాంటి ఆహారాన్ని తిన్న వ్యక్తి ఆనందాన్ని పొందుతాడు. దీనితో పాటు కుటుంబ సభ్యులు అందరూ కలిసి తినే వ్యక్తులు ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు.
భీష్మ పితామహుడు ఆహారం తినే చోట లేదా తినే ఆహారపు ప్లేట్ లో కాలు పెట్టినట్లు అయితే అటువంటి ఆహారపు ప్లేట్‌లో తినొద్దు. అలాంటి ప్లేట్‌లో ఆహారం తినడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది. దీనితో పాటు తినే ఆహారంలో వెంట్రుకలు వస్తే.. అటువంటి ఆహారం తినవద్దు. అలాంటి ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. వేరొకరికి అందించిన ఆహారాన్ని ఎప్పుడూ తినవద్దు. ఆలాంటి ఆహారం తినడం మంచిది కాదు.
భీష్మ పితామహుడు చెప్పిన దాని ప్రకారం భార్యాభర్తలు కలిసి ఒకే ప్లేట్‌లో కలిసి తినొద్దు. అలా ఒకే ప్లేట్ లో తినే ఆహారం మత్తు లాంటిది. పురాణ శాస్త్రాలలో కూడా భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో కలిసి తినడం తగదని భావిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు