Vijayawada Bhavani Devotees: ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. విజయదశమి పర్వదినం ముగియడంతో దీక్షల విరమణకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో కొండపైకి వాహనాలు అనుమతించడం లేదు. ఇవాళ, రేపు వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. కృష్ణా ఘాట్లు భవానీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. కనకదుర్గ ప్లైఓవర్‌పై రెండు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది.
కాగా, విజయవాడ ఇంద్రకీలాద్రిపై నగరోత్సవ కార్యక్రమాన్ని నిన్న వైభవంగా నిర్వహించారు. మహార్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవమూర్తులను కనకదుర్గానగర్ మల్లికార్జున మహా మండపం నుంచి ఘాట్ రోడ్డు మీదుగా దుర్గమ్మ సన్నిధికి చేర్చారు.
స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు విజయదశమి పర్వదినాన మహిషాసురమర్దిని అవతారంలో దర్శనమిచ్చారు.
Read also: PM Modi: దేశ అభ్యున్నతి కోసం సాక్షాత్తూ భారత ప్రధానితో మీ ఆలోచనలు, సమస్యలు చెప్పాలనుకుంటున్నారా?