
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 935వ సంవత్సరంలో అంటే 1528వ సంవత్సరం సెప్టెంబర్‌లో.. బాబర్ దగ్గర కమాండర్‌గా ఉన్న మీర్ బఖీ.. అయోధ్య ప్రజలకు ఓ ఆర్డర్ పాస్ చేశాడు. ఓ మసీదు కట్టబోతున్నాం అని. అప్పుడు ఉబికి వచ్చిందో కన్నీటి ధార. ఎప్పటిదాకా..! 2024 జనవరి 22 దాకా. అంటే.. 496 ఏళ్లు. హిందువుల కన్నీళ్లను తుడవడానికి దాదాపు 500 ఏళ్లు పట్టింది. ఆ బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన రోజున ఆ కన్నీటిధార ఆగింది. దేశంలోని ప్రతి ఊరు, ప్రతి వాడ సంబరాలు చేసుకుంది. పండగ జరుపుకుంది. ఆ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు హిందువుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. అయోధ్యపై ధర్మధ్వజం ఎగరేశారు కదా. అందుకు. గతేడాదే అయింది కదా వేడుకంతా. మరి.. ఈ ధర్మధ్వజం ఏంటి? సాధారణంగా.. మన ఇళ్లలో ఎవరైనా గర్భవతి అని తెలియగానే ఇంటిల్లిపాది సంబరాలు చేసుకుంటుంది కదా. కొన్ని వారాలకు సీమంతోనయనం పేరుతో అట్టహాసంగా వేడుక చేస్తాం కదా. ఓ ప్రాణం పురుడు పోసుకుందన్న సంతోషం అది. అదే జరిగింది 2024 జనవరి 22న. ఇప్పుడు బిడ్డ బయటికొచ్చింది. ఇంకే స్థాయిలో సంబరాలు జరగాలి. ఆ సంబురమే జరుగుతోంది అయోధ్యలో. ధ్వజారోహణం. సుమారు 500 ఏళ్లుగా హిందూ జాతి.. తమ ఆత్మాభిమానం కోసం చేసిన పోరాటానికి ముగింపు పలికిన క్షణం. దానికే ఈ సంబరం. అయోధ్య ధామం నిర్మాణం సంపూర్ణం అయిందని చెప్పడమే ధర్మధ్వజానికి అర్ధం. దాన్ని ఇంత సింపుల్‌గా...