Bhavanarayana Swamy Temple: బాపట్ల క్రీశ 594లో క్రిమికంఠీరవ చోళ మహారాజు నిర్మించిన ఆలయంలో కొలువైన ఉన్న భావన్నారాయణుడి పేరుతో బాపట్ల వెలిసింది. బాపట్ల పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కొంగుబంగారమై భావన్నారాయణుడు కోరిన కోర్కెలు తీరుస్తున్నాడు. బాపట్ల ప్రాంతానికి చారిత్రక, పురాణ నేపథ్యం ఉంది. నారాయణుడు భావన్నారాయణుడు ఎలా అయ్యాడో తెలిపే కథ ఆసక్తికరంగా ఉంటుంది.
కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మహర్షులు యజ్ఞము ఆచరించిన చోట క్షీర వృక్షము ఆవిర్భవించిందంట.. ఆ యజ్ఞాల్లో కొలువైన శ్రీ విష్ణువు ఆ క్షీర వృక్షములో కొలువై ఉన్నాడట. అయితే ఈ ప్రాంతానికి అత్యంత్య సమీపంలో ఉండే కొండకావూరు గ్రామానికి చెందిన బావ, బావమరుదులు ప్రతి రోజు ఈప్రాంతానికి వచ్చి వంట చెరుకుకు అవసరమై కట్టెలు తీసుకెళ్లేవారట… ఒక రోజు బావ క్షీర వృక్షముపై వేటు వేయగా రక్తము కారిందట. దీంతో బావ మూర్చిల్లిపోయాడు. సాయంత్రానికి బావను ఎదుక్కొంటూ ఆ ప్రాంతానికి వచ్చిన బావమరిది… బావ, బావ అంటూ పలిచాడట. అంతట ఓయ్్ అన్న పలుకు వినిపించిందట… ఆ పలుకు వచ్చని చోటుకి వెల్లి బావమరిది చూడగా….తన బావ మూర్చిల్లిపోయిన దృశ్యం కనపడింది. దీంతో బావమరిది ఆ వృక్షానికి మొక్కి తన బావ తిరిగి కొలుకుంటే ప్రతి ఆదివారం పొంగళ్లు పెడతామని వేడుకున్నాడట. అంతటా బావ కళ్లు తెరిచి చూశాడట. అప్పటి నుండి ప్రతి ఆదివారం కొండకావూరు నుండి వచ్చి భక్తులు పొంగళ్లు పెట్టేవారు.
అయితే క్రిమికంఠీరవ చోళుడు దండ యాత్రలో భాగంగా ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు ఆయన సైన్యంలో ఏనుగుల మేత కోసం ఈ ప్రాంతానికి వచ్చాయి. పట్టపు టేనుగు క్షీర వృక్షము వద్దకు వెళ్ళి దానికి తినబోయింది. అంతటా ఏనుగు తొండం ఆ చెట్టుకు అంటుకుపోయింది. ఎంత ప్రయత్నించిన రాకపోవటంతో రాజుకు ఈ విషయం చెప్పారు. దీంతో ఆ వృక్షము వద్దకు వచ్చిన రాజు భక్తితో వేడుకొనగా తన ఆలయం కట్టించమని స్వామి చెప్పాడట. అంతట ఏనుగు అక్కడ నుండి వచ్చింది. 108 ఏనుగు పాద స్థంభాలతో ఆలయం కట్టించమని స్వామి చెప్పాడు. దీంతో రాజు బొప్పూడి వద్ద నున్న రాళ్లతో స్వామి వారి ఆలయం నిర్మాణం చేపట్టాడు.
అయితే తెల్లవారే సరికి అంతక ముందు రోజు నిర్మించిన ఆలయం కూలిపోయేది. దీంతో మరోసారి రాజు స్వామివారిని వేడుకొనగా బావ పేరుతో ఉన్న రాళ్లనే తన ఆలయ నిర్మాణానికి ఉపయోగించాలని స్వామి చెప్పాడు. అంతట అటువంటి రాయి ఉన్న ప్రదేశం వెతకగా వెంకటగిరి సమీపంలోని చిమ్మిరిబండ వద్ద అటువంటి రాళ్లు ఉన్నాయని తెలిసింది. అక్కడ నుండి రాళ్లను తీసుకొచ్చి ఆలయ నిర్మానం పూర్తి చేశారు. అప్పటి నుండి భావన్నారాయణుడి ఇక్కడ పూజలందుకుంటున్నాడు.
ఈ ఆలయంలో అనేక ఉపాలయాలున్నాయి. ఆంజనేయ స్వామి దేవాలయం, చెన్నకేశవ ఆలయం, జ్వాలా నరసింహాఆలయం, కోదండ రామ స్వామి ఆలయాలున్నాయి. రాజ్యలక్ష్మీ దేవి ఇక్కడ కొలువై ఉంది. వైశాఖ పౌర్ణమి రోజు స్వామి వారి రధోత్సవం కన్నులపండుగగా జరుగుతోంది.
Reporter: T Nagaraju ,Tv9 Telugu
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..