Baleshwar Temple: భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి రాయ్‌బరేలీ జిల్లాలోని లాల్‌గంజ్ ప్రాంతంలో ప్రసిద్ధ బాలేశ్వర్ ఆలయం ఉంది. ఈ దేవాలయం సుమారు 600 సంవత్సరాల నాటిదని చారిత్రుల కథనం. ఒకప్పుడు ఈ ప్రదేశంలో అడవి ఉండేదని స్థానికుల కథనం. అప్పట్లో ఊరి ప్రజలు తమ పశువులను మేత కోసం ఈ ప్రాంతానికి తీసుకొచ్చేవారు. ఇంతలో ఓ ఆవు యజమానికి ఆవు పాలు ఇవ్వడం మానేసింది. దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలని యజమాని భావించి.. ఆవుని అన్వేషిస్తూ అడవికి వచ్చాడు. అక్కడ అతనికి అద్భుతం కనిపించింది. ఎందుకంటే ఆవు యజమాని కలలో శివుడు కనిపించి తాను ఇక్కడ వెలిసినట్లు చెప్పాడు.. ఆ కల నిజమవుతూ శివలింగం ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. బాబా బాలేశ్వరనాథ్ గా పూజలను అందుకుంటున్న విశిష్ట దేవాలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
గొర్రెల కాపరిపై అనుమానంతో అడవికి చేరుకున్న ఆవు యజమాని:
బల్హేమావు గ్రామానికి చెందిన తివారీ కుటుంబానికి చెందిన ఆవు గొర్రెల కాపరితో కలిసి అడవికి మేతకు వెళ్లేది. అకస్మాత్తుగా ఆవు పాలు ఇవ్వడం మానేసింది.. దీనికి కారణం గొర్రెల కాపరి ఆవు పాలను దొంగిలించి ఉంటాడని ఆవు యజమాని అనుమానించాడు. అందుకే ఆవు పాలు ఇవ్వడం లేదని భావించి గొర్రెల కాపరి దొంగతనాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి.. ఒకరోజు ఆవు యజమాని అడవికి వచ్చి అక్కడ పొదల్లో దాక్కుని కూర్చున్నాడు.
అద్భుతాన్ని చూసిన యజమాని:
ఆవు యజమాని ఆవు ఒక పొదలోకి వెళ్లి.. తన పొదుగు నుండి పాలు ఇస్తోంది. ఇది పొదల వెనుక నుండి యజమాని చూశాడు. భూమి నుంచి గుంతలోకి పాల ప్రవాహం వెళుతోంది. ఆవు యజమాని తన కళ్లలో చూసిన నిజాన్ని కూడా నమ్మలేకపోయాడు. ఆ రోజు రాత్రి ఆవు యజమాని చాలా అశాంతిగా ఉన్నాడు. నిద్రలోకి జారుకున్న సమయంలో అతనికి కలలో శివయ్య దర్శనం ఇచ్చాడు. నువ్వు ఆవును చూసిన చోటనే నేను ఉన్నానని శివుడు అతని కలలో చెప్పాడు. విగ్రహ పూజ కోసం ఒక ఆలయాన్ని ఏర్పాటు చేయమని సూచించాడు. దీంతో మరుసటి రోజు ఉదయం ఆవు యజమాని అతనికి వచ్చిన కల గురించి కుటుంబ సభ్యులకు చెప్పాడు. అనంతరం ఆ స్థలంలో తవ్వకాలు చేపట్టారు. త్రవ్వకాలలో అతనికి ఒక శివలింగం దొరికింది. ఆ తర్వాత అక్కడ బాలేశ్వరాలయం ఆలయాన్ని నిర్మించారు.
ఈ బాలేశ్వరాలయం పైన ఉన్న గోపురంపై అమర్చిన త్రిశూలం రోజంతా సూర్యుని వేగంతో సమానంగా తిరుగుతుందని చెబుతారు. ఈ ఆలయానికి ఎంతో గుర్తింపు ఉంది. ఇక్కడికి వచ్చి శివయ్యని దర్శనం చేసుకుని మనసులోని కోరికలు తీర్చాలని కోరుకుంటారు.
ఈ ప్రాంత ప్రజలు జనవరిలో బలేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. జనవరి 1న ఇక్కడ భారీ జాతర జరుగుతుంది. ప్రజలు ముందుగా లాల్‌గంజ్‌లోని భైరోన్ ఆలయానికి చేరుకుంటారు. అక్కడి నుండి యాత్రను ప్రారంభిస్తారు. యాత్రకు వెళ్లే ప్రజల కోసం భండారా కూడా ఏర్పాటు చేస్తారు. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో భండారా కూడా నిర్వహిస్తారు.
శ్రావణ మాసం, మహాశివరాత్రి నాడు భారీ జాతర:
శ్రావణ మాసంలో, మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భారీ జాతర జరుగుతుంది. ఈ జాతరకు అనేక ప్రాంతాల నుంచి భారీగా భక్తులు చేరుకుంటారు. ఆలయ అధికారులు జాతర కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం పై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)