Ayodhya: రామయ్యపై భక్తిని వినూత్నంగా చాటిన రైతన్న.. పొలంలో మొక్కజొన్న పొత్తులతో మందిర నిర్మాణం..

|

Jan 14, 2024 | 3:08 PM

అయోధ్యలో రామ మందిరం, నగరం అలంకారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు కొంతమంది రామ మందిరాన్ని ముగ్గులుగా, కళాకృతులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాత శ్రీరామచంద్ర ప్రభుపై తనకు ఉన్న భక్తిని వినూత్న రీతిలో చాటుకున్నాడు. అయోధ్యలో శ్రీ రామ చంద్ర ప్రభు మందిరాన్ని పోలిన ఆలయాన్ని తన పొలంలో మొక్క జొన్నలతో నిర్మించాడు. కర్నాటకలోని  ఇప్పుడు మొక్కజొన్న పొత్తులతో రామమందిరాన్ని నిర్మించాడు.

Ayodhya: రామయ్యపై భక్తిని వినూత్నంగా చాటిన రైతన్న.. పొలంలో మొక్కజొన్న పొత్తులతో మందిర నిర్మాణం..
Ayodhya Ram Mandir
Follow us on

కోట్లాది హిందువుల కల తీరే సమయం ఆసన్నం అవుతోంది. వారం రోజుల్లో అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. రామయ్య గర్భ గుడిలో కొలువుదీరనున్న శుభ సందర్భాన్ని పురష్కరించుకుని దేశ విదేశాల్లోని రామయ్య భక్తులు తమ భక్తిని వివిధ రకాలుగా ప్రకటించుకుంటున్నారు. అయోధ్యలో రామ మందిరం, నగరం అలంకారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు కొంతమంది రామ మందిరాన్ని ముగ్గులుగా, కళాకృతులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాత శ్రీరామచంద్ర ప్రభుపై తనకు ఉన్న భక్తిని వినూత్న రీతిలో చాటుకున్నాడు.

పొలంలో రామమందిర నిర్మాణం, మొక్కజొన్న

అయోధ్యలో శ్రీ రామ చంద్ర ప్రభు మందిరాన్ని పోలిన ఆలయాన్ని తన పొలంలో మొక్క జొన్నలతో నిర్మించాడు. కర్నాటకలోని  ఇప్పుడు మొక్కజొన్న పొత్తులతో రామమందిరాన్ని నిర్మించాడు. అవును, కొప్పల్ తాలూకాలోని ఓజనహళ్లి గ్రామంలో మొక్కజొన్న పొత్తులతో రామమందిరాన్ని నిర్మించారు.

ఓజనహళ్లి గ్రామానికి చెందిన తాతన గౌడ అనే రైతు భూమిలో మొక్కజొన్న పొత్తుతో రామమందిరాన్ని నిర్మించాడు. ఈ అన్నదాత తాను పండించిన మొక్కజొన్నలో ఓ ప్రైవేట్ సీడ్స్ కంపెనీ సహకారంతో రామమందిరాన్ని నిర్మించాడు. ఈ రామ మందిర నిర్మాణానికి సుమారు ఐదు వేల మొక్కజొన్న కంకులను ఉపయోగించినట్లు పేర్కొన్నాడు తాతన గౌడ్. ఈ రామమందిర నిర్మాణానికి 10 మంది కార్మికులు నిర్మించారు. క్కజొన్న పొత్తులతో నిర్మించిన రామమందిరాన్ని చూసేందుకు గ్రామస్థులతో పాటు పొరుగు గ్రామస్తులు కూడా వస్తున్నారు.  అయోధ్య రామమందిరం ప్రారంభం అయ్యేతంట వరకూ అంటే జనవరి 22వ తేదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు మొక్కజొన్నతో నిర్మించిన రామమందిరం ఉంచనున్నామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..