Ayodhya: అయోధ్యలో పాత రామ్ లల్లా విగ్రహాన్ని ఏం చేస్తారంటే..? క్లారిటీ ఇచ్చిన ఆలయ నిర్వాహకులు

|

Jan 22, 2024 | 9:20 AM

రామ్ లల్లా పురాతన విగ్రహాన్ని తాత్కాలిక ఆలయం నుండి తీసి కొత్త రామ్ లల్లా  విగ్రహంతో పాటు గర్భగుడిలో ప్రతిష్టించాలని ఇప్పటికే నిర్ణయించారు. చివరగా ఆదివారం సాయంత్రం, సతేంద్ర దాస్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో రామ చంద్రుడు సహా సోదరుల విగ్రహాలను తాత్కాలిక ఆలయం నుండి బయటకు తీసి రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్టించారు.

Ayodhya: అయోధ్యలో పాత రామ్ లల్లా విగ్రహాన్ని ఏం చేస్తారంటే..? క్లారిటీ ఇచ్చిన ఆలయ నిర్వాహకులు
Ram Lalla Old Statue
Follow us on

రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్య అందంగా ముస్తాబైంది. ఈ రోజు అయోధ్యలో అంగరంగ వైభవంగా నూతనంగా నిర్మించిన భారీ రామాలయాన్ని ప్రారంభించనున్నారు. బాల రాముడిని గర్భ గుడిలో ప్రతిష్టించనున్నారు. రేపటి నుంచి జన్మ భూమిలో కొలువుదీరిన  రామ భక్తులు బాల రామయ్యను దర్శనం చేసుకోనున్నారు.  51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని గురువారం ఆలయ గర్భగుడిలోకి చేర్చిన విషయం తెలిసిందే. అయితే విగ్రహ ప్రతిష్టాపనకు ఒక రోజు ముందు అంటే ఆదివారం (జనవరి 21వ తేదీ) రామ్ లల్లా  పురాతన విగ్రహాన్నీ తాత్కాలిక ఆలయం నుండి తొలగించి.. కొత్త రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్టించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆచార్య సతేంద్ర దాస్ ధ్రువీకరించారు.

సమాచారం ప్రకారం రామ్ లల్లా పురాతన విగ్రహాన్ని తాత్కాలిక ఆలయం నుండి తీసి కొత్త రామ్ లల్లా  విగ్రహంతో పాటు గర్భగుడిలో ప్రతిష్టించాలని ఇప్పటికే నిర్ణయించారు. చివరగా ఆదివారం సాయంత్రం, సతేంద్ర దాస్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో రామ చంద్రుడు సహా సోదరుల విగ్రహాలను తాత్కాలిక ఆలయం నుండి బయటకు తీసి రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్టించారు.

అయోధ్యకి చేరుకున్న సీఎం యోగి

సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం సాయంత్రం అయోధ్యకు చేరుకున్నారు. ఆలయ పూజారులతో కలిసి, రాంలాలా విగ్రహాన్ని తాత్కాలిక ఆలయం నుండి గొప్ప ఆలయానికి అంగరంగ వైభవముగా తీసుకువచ్చి కొత్త విగ్రహం సమీపంలో ప్రతిష్టించారు. ఈ విగ్రహాలు అష్టధాతువులతో నిర్మితమై ఉన్నాయి. ఈ పురాతన శిల్పాలలో రామ్ లల్లాతో పాటు ముగ్గురు సోదరులు భరతుడు, లక్ష్మణుడు, శతృఘ్నడు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

తాత్కాలిక ఆలయం నుండి షిఫ్ట్

వివాదాస్పద నిర్మాణం కారణంగా రామయ్య సమేత సోదరుల ఈ పురాతన విగ్రహాలు చాలా కాలం పాటు గుడారాల్లో ప్రతిష్టించబడ్డాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ భక్తులు రామ్ లల్లా దర్శనం చేసుకునేవారు.  వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించి అనంతరం రామాలయ నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత ఈ పురాతన విగ్రహాలను తాత్కాలిక ఆలయంలో ప్రతిష్టించారు. ఆదివారం అదే తాత్కాలిక ఆలయం నుంచి నూతనంగా నిర్మించిన రామాలయంలోని గర్భ గుడిలో రామ చంద్రుడు తన సోదరులతో కొలువుదీరాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..