బ్యాచిలర్స్ టైమ్.. మంచి ముహూర్తం మించన దొరకదు.. ఇక బాజాభజంత్రీలే..!

|

Oct 08, 2023 | 1:24 PM

పెళ్లి చేసుకునేందుకు ఎదురు చూస్తున్న బ్యాచిలర్ బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు వేద పండితులు. పెళ్లి ముహూర్తాలు వచ్చేస్తున్నారు. వరుసగా ఆరు నెలల పాటు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. దసరా పండుగ తరువాత రోజు నుంచి 6 నెలల పాటు బాజా భజంత్రీలు మోగనున్నాయి. పెళ్లి సందడితో రెండు తెలుగు రాష్ట్రాలు హోరెత్తనున్నాయి. ప్రధానంగా దసరా పండుగ తరువాత 2 నెలల పాటు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయట.

బ్యాచిలర్స్ టైమ్.. మంచి ముహూర్తం మించన దొరకదు.. ఇక బాజాభజంత్రీలే..!
Marriage
Follow us on

పెళ్లి చేసుకునేందుకు ఎదురు చూస్తున్న బ్యాచిలర్ బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు వేద పండితులు. పెళ్లి ముహూర్తాలు వచ్చేస్తున్నారు. వరుసగా ఆరు నెలల పాటు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. దసరా పండుగ తరువాత రోజు నుంచి 6 నెలల పాటు బాజా భజంత్రీలు మోగనున్నాయి. పెళ్లి సందడితో రెండు తెలుగు రాష్ట్రాలు హోరెత్తనున్నాయి. ప్రధానంగా దసరా పండుగ తరువాత 2 నెలల పాటు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయట. ఈ రెండు నెలలు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దాంతో పెళ్లీడు పిల్లలకు ఈసారి వివాహం చేసేందుకు రెడీ అయిపోతున్నారు తల్లిదండ్రులు.

వేద పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. దసరా తరువాత రెండు నెలలు వరసుగా ముహూర్తాలు ఉండగా.. డిసెంబర్ 3వ వారం నుంచి సంక్రాంతి పండుగ వరకు పెళ్లికి సంబంధించి మంచి ముహూర్తాలు లేవు. పండుగ తరువాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో వరుసగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అంటే, పదిహేను రోజుల గ్యాప్‌తో దాదాపు 6 నెలల పాటు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఈ గడువు దాటిపోతే.. మళ్లీ అక్టోబర్ వరకు ముహూర్తాలు లేవు. మంచి ముహూర్తాలు ముందుండటంతో.. పెళ్లీడుకొచ్చిన పిల్లల తల్లిదండ్రులు.. తమ పిల్లలకు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. తెలిసిన వారిని కలుస్తూ సంబంధాలు వెతుకుతున్నారు. మ్యారేజీ బ్యూరోలను సంప్రదించి సంబంధాలు సెట్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతానికి ఈ నెల 23వ తేదీన దసరా తరువాత నుంచి కార్తీక మాసం, ఆ తరువాత మార్గశిర మాసం, ఫిబ్రవరిలో వచ్చే మాఘమాసం వరకు అన్నీ శుభగడియలే ఉన్నాయి. పెళ్లిళ్లకు ఈ రోజులు శుభకరమైనవి. అందుకే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఫిక్స్ అయిన ముహూర్తాల కోసం ఫంక్షన్ హాల్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు ఫంక్షన్ హాల్స్ ఇప్పటికే బుక్ అయినట్లు తెలుస్తోంది.

పెళ్లిళ్లకు తోడు.. పొలిటికల్ మీటింగ్స్..

ఓవైపు పెళ్లి ముహూర్తాలు ఉంటే.. మరోవైపు ఎన్నికల డేట్ కూడా ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉండటంతో పొలిటికల్ హాడావుడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేతలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వరుస మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం చాలా వరకు నేతలు ఫంక్షన్ హాల్స్‌నే బుక్ చేసుకుంటున్నారు. దాంతో ఫంక్షన్స్ హాల్స్ సైతం దొరికే పరిస్థితి లేకుండా పోతోంది. మరోవైపు మంచి తరుణం మించినా దొరకదన్నట్లుగా.. ఫంక్షన్ హాల్స్ యజమానులు కూడా రెంట్స్ భారీగా పెంచేశారు. ఇటు పంక్షన్ హాల్స్ కొరత ఒకవైపు.. అటు పెరిగిన ధరలు మరోవైపు.. వెరసి పిల్లల పెళ్లి చేయాలనుకుంటున్న తల్లిదండ్రులకు ఇబ్బందిగా పరిణమించింది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..