Horoscope Today: ఈ రాశివారికి అంతా శుభప్రదమే.. వారికైతే ధనయోగం.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

| Edited By: Ravi Kiran

Jan 06, 2023 | 7:47 PM

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ఇతరులపై పర్యవేక్షణ వంటివి అప్పజెప్పే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల

Horoscope Today: ఈ రాశివారికి అంతా శుభప్రదమే.. వారికైతే ధనయోగం.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ఇతరులపై పర్యవేక్షణ వంటివి అప్పజెప్పే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అనవసర ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు. ఆదాయంలో పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనుకోకుండా బాగా దగ్గర వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా కాస్తంత పుంజుకుంటారు. పొదుపు సూత్రాలు పాటిస్తారు. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆర్థికంగా ఉపయోగకరమైన ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

ఇవి కూడా చదవండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కొందరు బంధువుల వల్ల ఆస్తి సంబంధమైన పేచీలు తలెత్తే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆర్థిక వ్యవహారాలలో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ పరంగాను, కుటుంబ పరంగాను ప్రశాంత వాతావరణం అనుభవానికి వస్తుంది. స్నేహితుల కారణంగా కొన్ని ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. అధికారుల నుంచి, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థిక సమస్యలు తల ఎత్తవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అసంతృప్తి కలిగిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఫలించి, ఆదాయం ఆశించినంతగా పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఉద్యోగ పరంగా మాత్రం బాగా కష్టపడాల్సి ఉంటుంది. అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. బదిలీకి అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి ఇది సమయం కాదు. తోబుట్టువులకు సహాయం చేస్తారు. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

స్నేహితులు మిమ్మల్ని పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ ఖర్చుల్ని అదుపు చేసుకోవాలి. ఉద్యోగపరంగా అధికారుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కుటుంబ సమస్యలు చక్కబడతాయి. బంధువులతో అపార్ధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. కొద్దిగా రుణ బాధ తగ్గించుకుంటారు. ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు వెళ్తారు.

మకరం (ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగ బాధ్యతల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక విషయాల్లో దుబారా ఉంటుంది. పొదుపు ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పెళ్లి ప్రయత్నంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

లౌకిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కుటుంబ వాతావరణంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగం మారటానికి ఇది సమయం కాదు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ఆవేశ కావేశాలకు దూరంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సమయం కాదు. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మంచివి. కొందరు మిత్రుల వల్ల అపనిందలు పడాల్సి వస్తుంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం చూడండి..