Astro Tips: ఇంట్లో ఆర్ధిక, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. కర్పూరంతో రెమెడీస్ ప్రయత్నించి చూడండి..

|

Dec 27, 2022 | 5:08 PM

కర్పూరంతో ఇచ్చే హారతి, హవనం ప్రతికూల శక్తుల ప్రభావాన్ని తొలగిస్తుంది. కర్పూరాన్ని వెలిగించడం వల్ల పర్యావరణంలో ఉండే అనేక రకాల సూక్ష్మజీవులు కూడా నాశనం అవుతాయి. కర్పూరం వెదజల్లే సువాసన ఇంట్లో సానుకూల శక్తుల ప్రవేశాన్ని పెంచుతుంది

Astro Tips: ఇంట్లో ఆర్ధిక, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. కర్పూరంతో రెమెడీస్ ప్రయత్నించి చూడండి..
Camphor Remedies
Follow us on

హిందూ మతంలో పూజలో కర్పూరానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అంతేకాదు.. కర్పూరం పరిహారం జ్యోతిషశాస్త్రంలో చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. పూజానంతరం ఆరతి, హవనంలో కర్పూరాన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. భగవంతుడిని సంతోషపెట్టడానికి అవసరమైన పూజా ద్రవ్యాలలో ఒకటి కర్పూరం.  కర్పూరంతో ఇచ్చే హారతి, హవనం ప్రతికూల శక్తుల ప్రభావాన్ని తొలగిస్తుంది. కర్పూరాన్ని వెలిగించడం వల్ల పర్యావరణంలో ఉండే అనేక రకాల సూక్ష్మజీవులు కూడా నాశనం అవుతాయి. కర్పూరం వెదజల్లే సువాసన ఇంట్లో సానుకూల శక్తుల ప్రవేశాన్ని పెంచుతుంది. భగవంతుని అనుగ్రహాన్ని కురిపిస్తుంది. అంతేకాదు జ్యోతిష్య శాస్త్రంలో కర్పూరాన్ని ఉపయోగించడం చాలా మేలు కలుగుతుందని పేర్కొన్నారు. కర్పూరం అశుభ గ్రహాల ప్రభావాన్ని తగ్గించి జీవితంలో అదృష్టాన్ని పెంచుతుంది.

పూజలో కర్పూరాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే: ఆధ్యాత్మికత, జ్యోతిష్యం దృష్ట్యా, కర్పూర హారతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజలో కర్పూర హారతిని ఇవ్వడం వల్ల దేవతలు ప్రసన్నం అవుతారని  నమ్మకం. కర్పూర హారతి ఇస్తే.. ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. ప్రతిరోజూ కర్పూరంతో హారతి ఇచ్చే ఇంటిలో ఎల్లప్పుడూ  సానుకూల శక్తి  ఉంటుంది. కర్పూరంతో ఇచ్చే హారతి నుంచి వెలువడే శక్తి దుష్ట శక్తులను నాశనం చేస్తుందని నమ్మకం.

ఇంటి వాస్తు దోషం.. కర్పూరం : వాస్తు శాస్త్రంలో కర్పూరానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇంట్లో ఉండే వాస్తు దోషాలను తక్షణమే తొలగిస్తుంది. వాస్తు దోషాలు తొలగిపోతే జీవితంలో సంతోషం, ఐశ్వర్యం ఉంటాయి. నిత్యం కర్పూరాన్ని వెలిగించే ఇళ్లలోకి దుష్ట శక్తులు ప్రవేశించవని ఒక నమ్మకం.

ఇవి కూడా చదవండి

కర్పూరంతో మరికొన్ని నివారణలు: 
చిన్న పిల్లలు ఉన్న ఇళ్ల చుట్టూ చాలా వరకు నెగెటివ్ ఎనర్జీ తిరుగుతుంది. అటువంటి పరిస్థితిలో..  పిల్లలు భయపడతారు  తరచుగా ఏడుస్తూ ఉంటారు. అటువంటి సమయంలో పిల్లలపై ఉన్న చెడు దృష్టిని తొలగించడానికి..  ప్రతిరోజూ సాయంత్రం కొన్ని కర్పూరాన్ని వెలిగించాలి.

రాత్రిపూట తరచుగా పీడకలలతో ఇబ్బంది పడేవారు.. రాత్రి సమయంలో పడకగదిలో కర్పూరాన్ని వెలిగించడం మంచి నివారణ.

ఎవరి జాతకంలోనైనా పితృ దోషం, రాహు దోషాలు ఉంటే, ఉదయం, సాయంత్రం కర్పూరాన్ని వెలిగించండి.

రాహు-కేతువుల ప్రతికూల ప్రభావాలు తొలగిపోవాలంటే కర్పూరాన్ని రుమాలులో చుట్టుకుని జేబులో పెట్టుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)