ఏప్రిల్‌లో అందుబాటులో పెళ్ళికి 4 రోజులు మాత్రమే.. తేదీ, సమయం సహా పూర్తి వివరాలు మీ కోసం..

|

Mar 30, 2024 | 11:35 AM

ఏప్రిల్ 13న మీన రాశిని విడిచి మేష రాశిలో సంచరిస్తాడు. దీని తర్వాత ఖర్మాలు ముగుస్తాయి. అదే సమయంలో ఏప్రిల్ 22 శుక్రుడు అస్తమించడం వల్ల మే, జూన్‌లలో వివాహ శుభ ముహూర్తాలు లేవు. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని ఆత్మ కారకంగా పరిగణిస్తారు. ధనుస్సు, మీన రాశులలో సూర్యభగవానుడు సంచరించడం వల్ల బృహస్పతి బలహీనంగా మారడం వల్ల 30 రోజులపాటు జరిగే ఖర్మాలు సంభవిస్తాయి. ఈ కాలంలో ఎటువంటి శుభ కార్యాలు జరగవు. ఖర్మలు ముగిసిన తర్వాత పెళ్లి బాజాలు మోగుతాయి. ఏప్రిల్ నెలలో వివాహానికి ఏ తేదీ, సమయం శుభప్రదమో తెలుసుకుందాం.

ఏప్రిల్‌లో అందుబాటులో పెళ్ళికి 4 రోజులు మాత్రమే.. తేదీ, సమయం సహా పూర్తి వివరాలు మీ కోసం..
Hindu Wedding Dates
Follow us on

హిందూ సనాతన ధర్మంలో శుభకార్యాలకు శుభ సమయం, ముహర్తం తప్పని సరి. అంతేకాదు ఖర్మాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. ఈ ఖర్మ సమయంలో ఏ శుభ కార్యమూ చేయరు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురు, శుక్రుడు అస్తమించినప్పుడు వివాహం లేదా ఏదైనా శుభ కార్యాలు చేయకూడదు. ప్రస్తుతం నవ గ్రహాలకు అధిపతి సూర్యుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అయితే ఏప్రిల్ 13న మీన రాశిని విడిచి మేష రాశిలో సంచరిస్తాడు. దీని తర్వాత ఖర్మాలు ముగుస్తాయి. అదే సమయంలో ఏప్రిల్ 22 శుక్రుడు అస్తమించడం వల్ల మే, జూన్‌లలో వివాహ శుభ ముహూర్తాలు లేవు. తర్వాత మళ్ళీ జూలై 2 నుంచి వివాహాలకు వివాహ శుభ ముహూర్తలు ఉంటాయి. అదే సమయంలో జూలై 16 నుండి నవంబర్ 12 వరకు చాతుర్మాసం  కారణంగా వివాహానికి శుభ ముహూర్తాలు లేవు.

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని ఆత్మ కారకంగా పరిగణిస్తారు. ధనుస్సు, మీన రాశులలో సూర్యభగవానుడు సంచరించడం వల్ల బృహస్పతి బలహీనంగా మారడం వల్ల 30 రోజులపాటు జరిగే ఖర్మాలు సంభవిస్తాయి. ఈ కాలంలో ఎటువంటి శుభ కార్యాలు జరగవు. ఖర్మలు ముగిసిన తర్వాత పెళ్లి బాజాలు మోగుతాయి. ఏప్రిల్ నెలలో వివాహానికి ఏ తేదీ, సమయం శుభప్రదమో తెలుసుకుందాం.

ఏప్రిల్ నెలలో వివాహాలకు శుభ ముహూర్తం

  1. 18 ఏప్రిల్ 2024- ఏప్రిల్ నెలలో వివాహానికి అనుకూలమైన సమయం ఏప్రిల్ 18 గురువారం. ఈ రోజు మఖ నక్షత్రం. ఈ తేదీన వివాహం చేసుకోవడం కూడా శుభప్రదం.
  2. 19 ఏప్రిల్ 2024- ఏప్రిల్‌లో వివాహానికి అనుకూలమైన సమయం శుక్రవారం, ఏప్రిల్ 19వ తేదీ. ఈ రోజు కూడా ఏకాదశి తిధి మఖ నక్షత్రం ఉంది. ఈ ఏకాదశి రోజున వివాహం చేసుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. 20 ఏప్రిల్ 2024- వివాహానికి అనుకూలమైన సమయం ఏప్రిల్ 20వ తేదీ శనివారం. ఈ రోజున నక్షత్రం ఉత్తర ఫాల్గుణి. అదే సమయంలో ద్వాదశి తిథి కూడా శుభ ప్రదంగా పరిగణించబడుతుంది.
  5. 21 ఏప్రిల్ 2024- ఏప్రిల్‌లో చివరి శుభ ముహర్తం.. ఏప్రిల్‌లో వివాహానికి అనుకూలమైన సమయం ఆదివారం, ఏప్రిల్ 21వ తేదీ. ఈ రోజు త్రయోదశి తిథి. నక్షత్రం ఉత్తర ఫాల్గుణి.
  6. జ్యోతిష్య శాస్త్రంలో త్రయోదశి తిథి వివాహానికి శుభప్రదం. అటువంటి పరిస్థితిలో వివాహ తేదీని నిర్ణయించడానికి ఖచ్చితంగా పండితుల సలహాలను తీసుకోవాలి.

ఏ మాసాల్లో వివాహ శుభప్రదం కాదంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, శుక్ర నక్షత్రాలు అస్తమించే సమయంలో వివాహం చేసుకోవడం శ్రేయస్కరం కాదు. ఏప్రిల్ 22 నుంచి శుక్రుడు అస్తమించడం వల్ల మే, జూన్ మాసాల్లో వివాహానికి అనుకూల సమయం లేదు. దీని తరువాత జూలై 2 నుండి వివాహానికి అనుకూలమైన సమయం అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా జులై 16 నుంచి నవంబర్ 12 వరకు చాతుర్మాసం కారణంగా వివాహానికి శుభ ముహూర్తాలు లేవు.  అయితే ఈ సమయంలో అబుజ ముహూర్తంలో వివాహాలు జరుపుకోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు