
అపర ఏకాదశి ఉపవాసం విష్ణువు ఆరాధనకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున దానధర్మాలు, స్నానం, ధ్యానం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అపర ఏకాదశి పూజ తర్వాత నీటిని దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
వామన అవతార ఆరాధన
అపర ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు అవతారమైన వామన అవతారాన్ని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున వామన అవతారాన్ని పూజించడం ఫలప్రదంగా పరిగణించబడుతుంది. ఆయన ఈ అవతారానికి మరో పేరు త్రివిక్రమ ప్రభువు. అపర ఏకాదశి రోజున చేసే ఉపవాసం మోక్షాన్ని పొందే మార్గంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండేవారు తెలిసి తెలియక చేసిన ఎటువంటి పాపాలు అయినా నశించిపోతాయని, ప్రేత జీవితం, బ్రహ్మహత్య (బ్రాహ్మణ హత్య) మొదలైన వాటి నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు.
ఏర్పడనున్న శుభ యాదృచ్చికాలు
ఈ సంవత్సరం మే 23 న వచ్చే ఈ అపర ఏకాదశి ఉపవాసం ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ రోజున గ్రహాలు , నక్షత్రరాశులు కలిసి నాలుగు శుభ కలయికలు కలిసి ఏర్పడనున్నాయి. ఆయుష్మాన్ , ప్రీతి యోగాలతో పాటు, సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. ఉత్తరాభద్రపద నక్షత్ర కలయిక కూడా ఈ రోజున ఏర్పడుతుంది అపర ఏకాదశి ఉపవాసాన్ని మే 24వ తేదీ శనివారం ఉదయం 5 గంటల తర్వాత విరమించాల్సి ఉంటుంది.
అపర ఏకాదశి 2025 శుభ సమయం
ఏకాదశి తిథి ఉదయం 1:12 గంటలకు ప్రారంభమై రాత్రి 10:29 వరకు ఉంటుంది.
సూర్యోదయం ఉదయం 5:26 గంటలకు
ప్రీతి యోగా ఉదయం నుంచి సాయంత్రం 6:37 వరకు
ఆయుష్మాన్ యోగం 6:37కి ప్రారంభమవుతుంది.
సర్వార్థ సిద్ధి యోగం మే 24న ఉదయం 4:02 నుంచి ప్రారంభమై 5:26 వరకు ఉంటుంది.
ఉత్తర భాద్రపద నక్షత్రం ఉదయం 4:02 వరకు ఉంటుంది.
అపర ఏకాదశి 2025 పూజ ముహూర్తం
బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:04 నుంచి 4:45 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు.
లబ్-ఉత్తన్ ముహూర్తం: ఉదయం 7:09 నుంచి 8:52 వరకు
అమృతం-ఉత్తమ సమయం: ఉదయం 8:52 నుంచి 10:35 వరకు
బుధ సంచారము 2025
ఈ సంవత్సరం అపర ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మే 23వ తేదీ మధ్యాహ్నం 1:05 గంటలకు బుధుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. బుధుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితిలో బుధ సంచారం వలన మొత్తం రాశులన్నిటిపై ప్రభావితం చూపిస్తుంది. ఈ ఏకాదశి అనేక రాశులకు చెందిన వ్యక్తులకు చాలా ఫలవంతమైనది.
ఈ అపర ఏకాదశి నాడు మంగళవారం నుంచి ప్రారంభమైన అగ్ని పంచకం కూడా ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు