Indrakeeladri: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం పునః ప్రారంభం.. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి

|

Feb 06, 2021 | 10:13 AM

బెజవాడ దుర్గమ్మ అన్నప్రసాద కార్యక్రమంపై స్పష్టత వచ్చింది. కోవిడ్-19 వ్యాప్తి తగ్గి ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం...

Indrakeeladri: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం పునః ప్రారంభం.. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి
Follow us on

బెజవాడ దుర్గమ్మ అన్నప్రసాద కార్యక్రమంపై స్పష్టత వచ్చింది. కోవిడ్-19 వ్యాప్తి తగ్గి ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని అధికారులు పునః ప్రారంభించారు. మల్లికార్జున స్వామి మహా మండపం రెండో అంతస్తులో నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా​ నిబంధనలు పాటిస్తూ.. అన్నప్రసాదం స్వీకరించేలా ఏర్పాట్లు చేశామని పాలమండలి వెల్లడించింది.

ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేశ్​ బాబు ఇతర పాలకమండలి సభ్యులు అన్నప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్ నేపథ్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి.. అన్నప్రసాదం ప్యాకెట్ల రూపంలో అందిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ మునుపటిలా నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

Also Read:

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మార్చి నుంచి ఆర్జిత సేవలకు గ్రీన్‌సిగ్నల్

Thunderstorm research centre: ఉరుములు, పిడుగులపై అధ్యయనానికి దేశంలో తొలి పరిశోధన కేంద్రం.. ఎక్కడంటే..?