Indrakeeladri: దుర్గ గుడి అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం.. ఆయల అభివృద్ధిపై మంత్రి ఆనం సమీక్ష

|

Dec 02, 2024 | 8:17 AM

ఇంద్రకీలాద్రి అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తోంది  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆలయాభివృద్ధిలో భాగంగా చేపట్టిన  పనుల్లో పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై జరిగిన సమావేశంలో... పలు కీలక నిర్ణయాలు  తీసుకున్నారు.

Indrakeeladri: దుర్గ గుడి అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం.. ఆయల అభివృద్ధిపై మంత్రి ఆనం సమీక్ష
Indrakeeladri Durga Temple
Follow us on

అమ్మలమన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దుర్గ గుడి అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రసాద్ పథకం ద్వారా గుడిని డెవలప్‌మెంట్ చేయాలని భావిస్తోంది. అయితే ప్రసాద్ పథకం ద్వారా నిధులు ఎలా రాబట్టాలనే అంశంపై ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దుర్గ గుడిలో సనాతన ధర్మాన్ని పాటించడంతో పాటు ఆగమ శాస్రాలు, వైదిక ఆచారాల ఆధారంగా మాస్టర్ ప్లాన్‌లోని అంశాంలపై ప్రధానంగా చర్చించారు. ప్రసాద్ పథకం రూల్స్ మారుతున్నాయని, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు, ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు మంత్రి ఆనం రామనారాయరెడ్డి సూచించారు.

దేవాదాయ, పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి ప్రణాళికలు రూపొందించాలని, అప్పుడే కేంద్రం నుంచి నిధులు విడులయ్యే ఛాన్స్ ఉందన్నారు ఎంపీ కేశినేని చిన్ని. గత పాలకులు ఆలయంలో సంప్రదాయాలు పాటించలేదని, తమ ప్రభుత్వంలో కచ్చితంగా అనుసరిస్తామని చెప్పారు. భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్‌లో నిల్చోకుండా వెయిటింగ్ రూములు నిర్మించాలన్నారు. వందేళ్ల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతులపై కచ్చితమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..