Lord Hanuman Idol: బావి తవ్వుతుండగా పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం లభ్యం… దర్శనంకోసం బారులు తీరిన భక్తులు

|

Nov 27, 2022 | 9:37 AM

ఓ రైతు తన వ్యవసాయ భూమిలో బావి కోసం తవ్వకం పనులు చేపట్టాడు. జేసీబీతో బావి కోసం గొయ్యి నుంచి మట్టి తీస్తున్న సమయంలో భారీ రాత్రి విగ్రహం బయల్పడింది. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందజేశారు.

Lord Hanuman Idol: బావి తవ్వుతుండగా పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం లభ్యం... దర్శనంకోసం బారులు తీరిన భక్తులు
Hanuman Idol In Jagtial
Follow us on

హిందూ సనాతన ధర్మం.. ప్రసిద్ధి క్షేత్రాలు, రహస్యలను దాచుకున్న ఆలయాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు.. తవ్వకాలలో గత తాలూకా వైభవానికి చిహ్నంగా అనేక విగ్రహాలు వస్తువులు తరచుగా దేశంలో ఎక్కడోచోట లభ్యమవుతూనే ఉంటాయి. తాజాగా రామ భక్తుడు హనుమంతుడు భారీ పురాతన విగ్రహం లభ్యమైంది.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కేంద్రంలో పురాతన ఆంజనేయ స్వామి రాతి విగ్రహం బయల్పడింది. రాయికల్ చెందిన ఓ రైతు తన వ్యవసాయ భూమిలో బావి కోసం తవ్వకం పనులు చేపట్టాడు. జేసీబీతో బావి కోసం గొయ్యి నుంచి మట్టి తీస్తున్న సమయంలో భారీ రాత్రి విగ్రహం బయల్పడింది. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందజేశారు. అనంతరం పురావస్తు శాఖ అధికారులు అక్కడకు చేరుకొని పరిశీలించారు. ఆ విగ్రహం అతి పురాతనమైనదని భక్త ఆంజనేయ స్వామివారి విగ్రహన్నీ రాతితో మలిచినట్టు పురావస్తు శాఖ నిపుణులు తెలిపారు. ఈ విగ్రహాన్ని చూడటానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. పూజలను చేస్తున్నారు.

హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆంజనేయుడుకి పూజలను నిర్వహిస్తారు. హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశంలో హనుమంతుని గుడి లేని ఊరు బహు అరుదని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..