
Amarnath Yatra 2026: లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న అమర్‌నాథ్ యాత్ర 2026 జూలై 3న ప్రారంభం కానుంది. ఈ యాత్ర ఆగస్టు 28న (రక్షా బంధన్) ముగియనుంది. యాత్ర ప్రారంభానికి ముందు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా జమ్మూ-కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంప్రదాయ తొలి పూజ నిర్వహించి బాబా బర్ఫానీ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పవిత్ర యాత్రకు సిద్ధమవుతున్నారు. మీరు కూడా ఈసారి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలని భావిస్తున్నట్లయితే, ముందుగా సరైన సన్నాహాలు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎత్తైన ప్రాంతాల్లో జరిగే ఈ యాత్రలో వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. అందుకే ఏం వెంట తీసుకెళ్లాలి? ఏం తీసుకెళ్లకూడదు? తెలుసుకోవడం అత్యంత అవసరం.
అమర్‌నాథ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవచ్చు. కాబట్టి మీ బ్యాగ్‌లో వీటిని తప్పకుండా ఉంచండి. థర్మల్ ఇన్నర్‌వేర్, ఉన్ని స్వెటర్, వాటర్‌ప్రూఫ్ లేదా విండ్‌చీటర్ జాకెట్, ఉన్ని టోపీ, మఫ్లర్, గ్లౌజులు, అదనపు ఉన్ని సాక్సులు, రెయిన్‌కోట్ లేదా పాంచో.
బీపీ, షుగర్, ఆస్తమా లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడేవారు తగినన్ని మందులు వెంట తీసుకెళ్లాలి. మీ ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి.
యాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా వెంట ఉంచుకోండి.
ప్రయాణంలో ఉపయోగపడే ఇతర వస్తువులు.. టార్చ్ లేదా ఫ్లాష్‌లైట్, అదనపు బ్యాటరీలు, పవర్ బ్యాంక్, మొబైల్ ఛార్జర్, సన్ గ్లాసెస్, సన్‌స్క్రీన్, లిప్ బామ్, నీటి బాటిల్, డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ బార్లు, గ్లూకోజ్ ప్యాకెట్లు. ఎత్తైన ప్రాంతాల్లో సూర్యకిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే సన్ గ్లాసెస్, సన్‌స్క్రీన్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
అమర్‌నాథ్ యాత్ర సముద్ర మట్టానికి చాలా ఎత్తులో జరుగుతుంది. అక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే..
అమర్‌నాథ్ యాత్ర కేవలం ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు, శారీరకంగా కూడా ఎంతో సవాలుతో కూడుకున్నది. సరైన ప్రణాళిక, అవసరమైన సామగ్రి, ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే ఈ పవిత్ర యాత్రను సురక్షితంగా, ప్రశాంతంగా పూర్తి చేయవచ్చు.