Aero plane Gurudwara : మన చిల్కూరు బాలాజీ లాగే.. మరో వీసా దేవుడు.. ప్రసాదం ఏమిటో తెలుసా..!!

|

Mar 06, 2021 | 6:41 PM

ఉన్నత చదువుల కోసం, మంచి ఉద్యోగం కోసం విదేశాలు వెళ్లాలని ఎక్కువమంది యువత కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణం అనే కలను తీర్చుకొనేందుకు వీసా కోసం..

Aero plane Gurudwara : మన చిల్కూరు బాలాజీ లాగే.. మరో వీసా దేవుడు.. ప్రసాదం ఏమిటో తెలుసా..!!
Follow us on

Aero plane Gurudwara : ఉన్నత చదువుల కోసం, మంచి ఉద్యోగం కోసం విదేశాలు వెళ్లాలని ఎక్కువమంది యువత కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణం అనే కలను తీర్చుకొనేందుకు వీసా కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో చిల్కూరు బాలాజీ కి వీసా దేవుడు అనే పేరుంది. వీసా కోసం మొక్కుంటారు.. అయితే మన చిల్కూరు బాలాజీ నే కాదు మనదేశంలో మరో వీసా దేవుడు కూడా ఉన్నాడు.

పంజాబ్ లో సిక్కులు ఏకంగా విమాన దేవాలయం నిర్మించారు. ఈ దేవుడుకి వీసా దేవుడనే పేరు కూడా పెట్టి.. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఆ దేవుడికి బొమ్మ విమానాలను కానుకగా ఇస్తారు కూడా..!!
పంజాబ్ లోని జలంధర్ తల్ హాన్ లో హవాయూ జహాజ్ గురుద్వారా గా పిలిచే సిక్కుదేవాలయం ఉన్నది. కాగా ఒకప్పుడు ఈ గురుద్వారాని షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారాగా పిలిచేవారు.

ఈ గురుద్వారాను స్థానిక జాట్ కమ్యునిటీ, దళిత వర్గాల ప్రజలు వందేళ్ల క్రితం నిర్మించారు. ఈ గురుద్వారాలో ప్రార్ధన సమయంలో వీసా ఆమోదం పొందగలరు అనే విశ్వాసం ఉంది. ఇక్కడ భక్తులు విమానం బొమ్మనే ప్రసాదం గా ఇస్తారు. ఇలా చేస్తే.. త్వరగా వీసా లభిస్తుందని నమ్మకం. విమాన ప్రయాణం సమయంలో ఎటువంటి ఆపదలు కలగ కుండా రక్షణ కలుగుతుందని నమ్మకం. విదేశీ ప్రయాణం చేసే వారు ఈ గుడిలో విమానం బొమ్మను సమర్పిస్తారు. ఇక్కడ షాపుల్లో ఎయిర్ ఇండియా, బ్రిటిష్ ఎయిర్ వేస్, లుఫ్తాన్సా లాంటి విమాన బొమ్మ నమూనాలు తయారు చేసి అమ్ముతారు. ఒక్కొక్కటి రూ.50 నుంచి 500 వరకూ ఉంటాయి. ఇక్కడ రోజూ కొన్ని వందల బొమ్మలు అమ్ముడవుతాయి.. ఈ గురుద్వారాకు వెళ్లాలంటే.. జలంధర్ నుంచి సుమారు.. 12 కి.మీ దూరంలో ఉన్న చిన్నన్ గ్రామం చేరుకోవాలి.

Also Read:

ఆ హక్కులు కాలరాసేందుకు రాజ్యాంగం సవరించే కుట్ర జరుగుతుంది. పట్టభద్రులు ఆలోచించాలన్న హరీశ్‌రావు

ఉన్నత ఉద్యోగాలు వదిలి కూరగాయలు పండిస్తున్న ఓ యువజంట.. కోట్లల్లో సంపాదన