Statue of Equality: రేపు సాయంత్రం ముచ్చింతల్‌‌లో 108 క్షేత్రాల భగవన్మూర్తుల ప్రథమ కల్యాణ మహోత్సవం.. అందరూ ఆహ్వానితులే..

|

Feb 18, 2022 | 5:54 PM

Statue of Equality: ముచ్చింతల్‌(Muchintal) దివ్యక్షేత్రం శ్రీరామనగరం ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. భగవద్ రామానుజ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 క్షేత్రాల..

Statue of Equality: రేపు సాయంత్రం ముచ్చింతల్‌‌లో 108 క్షేత్రాల భగవన్మూర్తుల ప్రథమ కల్యాణ మహోత్సవం.. అందరూ ఆహ్వానితులే..
Chinna Jeeyar Swamiji
Follow us on

Statue of Equality: ముచ్చింతల్‌(Muchintal) దివ్యక్షేత్రం శ్రీరామనగరం ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. భగవద్ రామానుజ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 క్షేత్రాల భగవన్మూర్తుల ప్రథమ కల్యాణ మహోత్సవాన్ని చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 108 దివ్య దేశాలతో అలరారుతున్న దివ్యసాకేత క్షేత్రంలో మొట్టమొదటిసారిగా ఈ మహోత్సవం.. నిర్వహించనున్నారు. ఈ కళ్యాణం రేపు (ఫిబ్రవరి 19వ తేదీ) సాయంత్రం 5 గంటల నుంచి 8వరకూ భగవద్ రామానుజ వారిని చేరే దివ్య సోపాన మార్గంలో జరగనుంది. ఈ శాంతి కల్యాణ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం అందించామని చినజీయర్‌ స్వామి చెప్పారు.

ఈ నెల 20 నుంచి సువర్ణమూర్తి విగ్రహాన్ని దర్శనానికి అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.
శ్రీ రామానుజ సువర్ణ మూర్తి దర్శనం తో పాటు 108 దివ్యదేశాలలో నియర్ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్, 3డి టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు తద్వారా సందర్శకులకు మరింత సౌలభ్యం లభిస్తుందని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి చెప్పారు. ప్రధానమంత్రి మోడీ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా వారి ఆదేశాల పాటించాలని సీఎం కేసీఆర్ చెప్పారని అంతేకానీ సీఎం కేసీఆర్ తో తనకు కు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. శిలాఫలకం ఏర్పాటు విషయంలో ఈ విభేదాలు అన్ని మీడియా సృష్టేనని… సీఎం కేసీఆర్ కు తన మధ్య ఎలాంటి విభేదాలు లేవని చిన్న జీయర్ స్వామి తెలిపారు . ముచ్చింతల్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తానే మొదటి వాలింటర్ నని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పిన విషయాన్ని చిన జీయర్ స్వామి మీడియాకు గుర్తు చేశారు. ఎంట్రీ ఫీజు విషయంలో త్వరలోనే సరైన నిర్ణయం తీసుకొని అందరికీ అందుబాటులో ఉండేటట్లు చేస్తామని చిన్న జీయర్ స్వామి తెలిపారు. సమతా మూర్తి స్పూర్తిని అందరూ పాటించాలని సమాజాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ తొలగిపోవాలని ఆయన అన్నారు. కరోనా తగ్గుముఖం పట్టడం మహా అద్భుతం అని ఇది యాగ ఫలమే అని చిన్న జీయర్ స్వామి తెలిపారు.
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంలో మీడియా సహకారం అందించిందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజీ అన్నారు.

చరిత్రలో ప్రప్రథంగా జరిగే ఈ అద్భుత మహోత్సవాన్ని దర్శించడానికి శ్రద్ధాళువులందరికీ హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నారు.  కల్యాణ మూర్తుల దివ్యదేశాల నుంచి కల్యాణ ప్రాంగణానికి చేరడం వలన మూల స్థానాలు మూసి ఉంటాయని తెలిపారు. ఈ ఐతిహాసిక మహాద్భుత కార్యక్రమాన్ని కనులారా వీక్షించి, సేవించి తరించే సౌభాగ్యాన్ని అందరూ వినియోగించుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.

Also Read:

శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కి ఒక్కరోజే రూ. 85 కోట్ల భారీ విరాళం.. మొత్తం 550 కోట్లు వస్తాయని అంచనా..