ఢిల్లీ నుంచి షిఫ్ట్ కానున్న సోనియా గాంధీ.. పెరిగిపోతున్న వాయు కాలుష్యమే కారణమా.!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపధ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొద్దిరోజుల పాటు చెన్నై లేదా గోవా వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

  • Ravi Kiran
  • Publish Date - 12:00 pm, Fri, 20 November 20
ఢిల్లీ నుంచి షిఫ్ట్ కానున్న సోనియా గాంధీ.. పెరిగిపోతున్న వాయు కాలుష్యమే కారణమా.!

Sonia Gandhi Left Out Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపధ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొద్దిరోజుల పాటు చెన్నై లేదా గోవా వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆమె ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న నేపధ్యంలో వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం సోనియా గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరే అవకాశం ఉందని, వారితో పాటు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వాద్రా కూడా వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఛాతీ నొప్పి కారణంగా సోనియా గాంధీ జూలై 30న గంగారాం ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. ఇక ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి సోనియా గాంధీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. అంతేకాకుండా సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సెప్టెంబర్ నెలలో ఆమె విదేశాలకు  కూడా వెళ్లారు. ఇక ఇప్పుడు ఢిల్లీలో వాయు కాలుష్యం తారస్థాయికి చేరిపోవడం.. దాని కారణంగా ఉబ్బసం, ఛాతీ నొప్పి తీవ్రమయ్యే అవకాశాలు ఉండటంతో ఆమెను కొద్దిరోజుల పాటు వేరే ప్రదేశానికి వెళ్లాలని డాక్టర్లు సూచించారు.

Also Read:

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..