చెట్లపై ఉంటూ ప్రాణాలు రక్షించుకుంటున్న పాములు

కర్ణాటకలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సామన్య జనజీవనం అనేక ప్రాంతాల్లో స్థంభించిపోయింది. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ..

చెట్లపై ఉంటూ ప్రాణాలు రక్షించుకుంటున్న పాములు
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 5:23 AM

కర్ణాటకలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సామన్య జనజీవనం అనేక ప్రాంతాల్లో స్థంభించిపోయింది. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. శివమొగ్గ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగా నది పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు.. పశువులు, జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా పాములు కూడా వరదల ప్రభావానికి గురయ్యాయి. ఉండటానికి ఎలాంటి ప్రదేశాలు లేకపోవడంతో.. చెట్లపై ఉంటూ దర్శనమిచ్చాయి. శివమొగ్గ ప్రాంతంలోని ఓ చెట్టుపై కొన్ని పాములు ఉండటాన్ని ఓ వ్యక్తి గమనించి వీడియో తీశాడు. అందులో పాములు వరదల్లో చిక్కుకుపోవడంతో.. చెట్టుపై ఉంటూ ప్రాణాలు కాపాడుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Read More :

కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే