RRR: ఎన్టీఆర్ వచ్చేశాడు.. నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే..!

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ కోసం ఇటీవల చిత్ర యూనిట్ బల్గేరియాకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ చిత్రీకరణలో భాగంగా ఎన్టీఆర్‌తో పాటు మరికొందరిపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి. తాజాగా ఈ షెడ్యూల్ ముగియడంతో ఆదివారం వారంతా […]

RRR: ఎన్టీఆర్ వచ్చేశాడు.. నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే..!
Follow us

| Edited By:

Updated on: Sep 16, 2019 | 11:49 AM

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ కోసం ఇటీవల చిత్ర యూనిట్ బల్గేరియాకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ చిత్రీకరణలో భాగంగా ఎన్టీఆర్‌తో పాటు మరికొందరిపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి. తాజాగా ఈ షెడ్యూల్ ముగియడంతో ఆదివారం వారంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

అలాగే తదుపరి షెడ్యూల్‌ను నగరంలోనే ప్లాన్ చేశాడట రాజమౌళి. త్వరలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుండగా.. అందులో రామ్ చరణ్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఈ షెడ్యూల్‌లో ఆమె కూడా భాగం కానుందని సమాచారం. కాగా ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జూలై 30న ఆర్ఆర్ఆర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఇద్దరు టాప్ హీరోలతో జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఆర్ఆర్ఆర్‌ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఆర్ఆర్‌ఆర్ విడుదల కాబోతుంది.

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!