AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంత అందం మనోళ్లు ఎలా మిస్ అయ్యారు మావ..! నితిన్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ మూవీ తర్వాత యంగ్ హీరో నితిన్ , గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మరో చిత్రం రాబిన్ హుడ్. ఛలో, భీష్మ సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుమల ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆసీస్ డ్యాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషించడం, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడంతో రాబిన్ హుడ్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఇంత అందం మనోళ్లు ఎలా మిస్ అయ్యారు మావ..! నితిన్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Nithin
Rajeev Rayala
|

Updated on: Apr 21, 2025 | 8:41 AM

Share

నితిన్ ప్రస్తుతం సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. చివరిగా నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. గతంలో నితిన్ వరుసగా 13 సినిమాలు ఫ్లాప్స్ అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన సై సినిమా తర్వాత సక్సెస్ అందుకోవడానికి చాలా కష్టపడ్డాడు. చాలా కాలం తర్వాత ఇష్క్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇష్క్ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరూ హిట్ పెయిర్ గా నిలిచారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించిన మరో సూపర్ హిట్ మూవీ గుండెజారి గల్లంతయ్యిందే. 2013లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు విజయ్ కుమార్ దర్శకతం వహించారు. ఈ మూవీలో నిత్యామీనన్ తో పాటు మరో హీరోయిన్ కూడా నటించింది. ఆమె పేరు ఇషా తల్వార్. అలాగే గుత్తా జ్వాలా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన ఇషా తల్వార్ తెలుగులో పెద్దగా రాణించలేకపోయింది. అయితే గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో ఇషా తల్వార్ పాత్రకు కూడా నిత్యామీనననే డబ్బింగ్ చెప్పింది. అయితే ఇప్పుడు ఇషా తల్వార్ ఎలా ఉంది. ? ఎక్కడ ఉంది.? ఇప్పుడు ఏం చేస్తోంది .? అని నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇషా తల్వార్ తండ్రి కూడా బాలీవుడ్ నటుడు. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. ఇక హీరోయిన్ గా సినిమాలు మాత్రం మాలీవుడ్ లో చేసింది. తట్టతిన్ మరయతు అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మైనే ప్యార్ కియా, రాజా చెయ్యి వేస్తే అనే సినిమాలు మాత్రమే తెలుగులో చేసింది. ఆతర్వాత మలయాళంలో హిందీలో సినిమాలు చేసింది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో ఫుల్ బిజీగా ఉంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా చేసింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాలో 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటికీ ఈ అమ్మడు అంతే అందంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Isha Talwar (@talwarisha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్