మెజారిటీతో గెలిచినా వ్యవస్ధల్ని నిర్వీర్యం చేయలేదు : సోనియా
ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించేందుకు, వారిని భయపెట్టేందుకు మాజీ ప్రధాని రాజీవ్ ఎన్నడూ తన అధికారాలను ఉపయోగించలేదని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదన్నారు ఏఐసీసీ అధినేత్రి, రాజీవ్ గాంధీ సతీమణి సోనియాగాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన ఓ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శిస్తూ సోనియా ఇలా వ్యాఖ్యానించారు. 1984 లోక్ […]

ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించేందుకు, వారిని భయపెట్టేందుకు మాజీ ప్రధాని రాజీవ్ ఎన్నడూ తన అధికారాలను ఉపయోగించలేదని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదన్నారు ఏఐసీసీ అధినేత్రి, రాజీవ్ గాంధీ సతీమణి సోనియాగాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన ఓ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శిస్తూ సోనియా ఇలా వ్యాఖ్యానించారు.
1984 లోక్ సభ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు బీజేపీ కంటే అధికంగా సీట్లు సంపాదించారన్నారు సోనియా. అంతపెద్ద మెజారిటీ వచ్చినప్పటికీ స్వతంత్ర వ్యవస్థలను నిర్వీర్యం చేయలేదన్నారు. ఒక ప్రధానిగా దేశ ఐక్యతను కాపాడుతూనే భారత్ వైవిధ్యాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పారని సోనియా వెల్లడించారు.