Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

2వేల నోటుకు గుడ్‌బై.. బ్లాక్ మనీ బ్రేకేసేందుకేనట..!!

Printing of Rs.2000 notes stopped, 2వేల నోటుకు గుడ్‌బై.. బ్లాక్ మనీ బ్రేకేసేందుకేనట..!!

ఇటీవల కాలంలో మనం గమనించినట్లైతే రూ.2వేల నోట్లు చాలా కరువయ్యాయి. ఏటీఎంల నుంచి కూడా రూ. 2వేల నోట్లు రావడం లేదు. అయితే మీకో షాకింగ్ విషయం తెలుసా.? ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రణ కాలేదట. ఈ విషయం ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా తెలిసింది. ఇటీవల కాలంలో రూ.2వేల నోట్లు ఎన్ని ముద్రణ అయ్యాయంటూ  ఓ దినపత్రిక కోరిన ప్రశ్నకు సమాధానంగా ఆర్టీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. బ్లాక్ మనీకి బ్రేక్ వేసేందుకు రూ.2వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆర్బీఐ నిలిపివేసినట్లు ఆ శాఖ వెల్లడించింది.

దీనిపై ప్రముఖ ఎకనమిస్ట్ నితిన్ దేశాయ్ మాట్లాడుతూ.. ‘‘పెద్ద నోట్లను ఆపడం వలన బ్లాక్‌మనీ లావాదేవీలకు ఇబ్బంది కలుగుతుంది. కానీ నోట్ల రద్దుతో పోలీస్తే ఈ చర్య ఒక రకంగా చాలా మంచిదే. చాలా యూరోపియన్ దేశాల్లో నల్లధనానికి బ్రేక్ వేసేందుకు ఇలా పెద్ద నోట్లను అప్పుడప్పుడు రద్దు చేస్తుంటారు’’ అని పేర్కొన్నారు. కాగా 2016 నవంబర్‌లో మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను ఉన్నట్లుండి రద్దు చేసి.. ఆ తరువాత రూ.2వేల నోటును సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆర్టీఐ వివరాల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ.2వేల నోట్లను ప్రింట్ చేశారు. ఇక 2017-18లో ఈ సంఖ్య కాస్త తగ్గి.. 111.507మిలియన్‌కు చేరింది. ఆ తరువాత 2018-19లో 46.690మిలియన్ రూ.2వేల నోట్ల ముద్రణ మాత్రమే జరిగింది. దీని బట్టి చూస్తుంటే.. భవిష్యత్‌లో రూ.2వేల నోట్లు కనిపించవని సుస్ఫష్టంగా అర్థమవుతోంది.

Related Tags