టీటీడీ బోర్డు ఛైర్మన్ గా వైవీ ?

| Edited By: Srinu

Jun 20, 2019 | 4:44 PM

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు  నూతన ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేసిన నేపధ్యంలో వైవీకి  మార్గం సుగమమైంది. టీటీడీ  పాలక మండలిని రద్దు చేసే వరకు తాను ఛైర్మన్ పదవి నుంచి తప్పుకునేది లేదని తెగేసి చెప్పిన సుధాకర్ యాదవ్.. బుధవారం దేవాదాయ శాఖామంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్ తిరుమలలో చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో రాజీనామా చేయాల్సివచ్చింది. 2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ప్రత్యక్ష రాజకీయాల్లోకి […]

టీటీడీ బోర్డు ఛైర్మన్ గా వైవీ ?
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు  నూతన ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేసిన నేపధ్యంలో వైవీకి  మార్గం సుగమమైంది.

టీటీడీ  పాలక మండలిని రద్దు చేసే వరకు తాను ఛైర్మన్ పదవి నుంచి తప్పుకునేది లేదని తెగేసి చెప్పిన సుధాకర్ యాదవ్.. బుధవారం దేవాదాయ శాఖామంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్
తిరుమలలో చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో రాజీనామా చేయాల్సివచ్చింది.
2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు సుబ్బారెడ్డి.  ఈసారి రాజకీయ సమీకరణాల రీత్యా ఆస్ధానాన్ని మాగుంట శ్రీనివాసులురెడ్డికి కేటాయించడంతో పార్టీలో ఆయన స్ధానంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.  అయితే ఆయనకు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పిస్తే బాగుంటుందని  పార్టీలో అభిప్రాయం వ్యక్తమయింది. దీనిపై తనకు  టీటీడీ బోర్డు ఛైర్మన్  పదవి చేపట్టడం ఇష్టమనే  సంకేతాలిచ్చారు వైవీ. అదే సమయంలో సీఎం జగన్ తనకు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానన్నారు.

మొత్తానికి వైవీ సుబ్బారెడ్డి తిరుమల దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా పదవి చేపట్టబోతున్నారు.  ఆయన శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.