Vijayasai Reddy: చంద్రబాబు తన పరువు తనే తీసుకుంటున్నారు.. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు

|

Nov 26, 2021 | 11:25 AM

YSRCP vs TDP: రాజకీయాల్లో లేని తన భార్యను వైసీపీ నేతలు అవమానించారని చంద్రబాబు నాయుడు చెప్పుకోవడంలో వాస్తవం లేదని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు.

Vijayasai Reddy: చంద్రబాబు తన పరువు తనే తీసుకుంటున్నారు.. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు
Vijayasai Reddy
Follow us on

రాజకీయాల్లో లేని తన భార్యను వైసీపీ నేతలు అవమానించారని చంద్రబాబు నాయుడు చెప్పుకోవడంలో వాస్తవం లేదని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు నాయుడు భార్య గురించి ప్రస్తావించలేదన్నారు. అయితే చంద్రబాబు తన పరువు తనే తీసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. వరద ప్రాంతాల సందర్శనను ‘స్వియ ఓదార్పు’ యాత్రగా చంద్రబాబు మార్చారని విమర్శించారు. నష్టపోయిన రైతుల గురించో.. బాధితుల గురించో చంద్రబాబు మాట్లాడుతాడు అనుకుంటే.. మళ్లీ అదే పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మేకతోలు కప్పుకున్న తోడేలుగా విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆలోచలన్నీ విషపూరితంగానే ఉంటాయన్నారు. తన అసలు స్వరూపం బయటపడకుండా చంద్రబాబు కంట్రోల్ చేసుకోలేరని అన్నారు. అధికార పీఠానికి తనను దూరం చేసిన జగన్‌పై విషం కక్కడం ఇది మొదటిసారి కాదన్నారు. చివరకు తనను ఓడించిన ప్రజలు కూడా నాశనమైపోవాలని శాపనార్థాలు పెట్టే ఉన్మాద మనస్తత్వం చంద్రబాబుదంటూ ఆయన ధ్వజమెత్తారు.

సీఎం జగన్ గాల్లో కలిసిపోతారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా చంద్రబాబు మారలేదన్నారు.

Also Read..

Shreyas Iyer: డెబ్యూ టెస్ట్‌లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్.. తొలి సెంచరీ పూర్తి.. 16వ భారత ప్లేయర్‌గా రికార్డు

Samantha: ఇట్స్ అఫీషియల్.! హాలీవుడ్‌‌లోకి అడుగుపెట్టనున్న సమంత.. డైరెక్టర్ ఎవరంటే.?