వైసీపీలో అసమ్మతి మొదలైందా?..తనకు స్వేచ్ఛనివ్వడం లేదంటూ దళిత ఎమ్మెల్యే ఆవేదన!

| Edited By: Pardhasaradhi Peri

Oct 03, 2019 | 9:19 AM

‘జగన్ జాగ్రత్తపడాలి..లేకపోతే సొంత ఎమ్మేల్యేల నుంచి తిరుగుబాటు జరిగే ప్రమాదం ఉంది’..ఇవి ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండటం, జగన్.. అవినీతికి ఆస్కారం ఇవ్వకపోడం, పని విషయంలో నిబ్ధతగా ఉండాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో..ముందు జాగ్రత్త హెచ్చరికగా ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రివర్గ విస్తరణలో సమయంలో, నామినేటెడ్ పదవులు విషయంలో ఎంతమంది ఆశావహులు ఉన్నారో చూశాం. ఖచ్చితంగా పదవి దక్కని వారికి ఎంతోకొంత అసమ్మతి […]

వైసీపీలో అసమ్మతి మొదలైందా?..తనకు స్వేచ్ఛనివ్వడం లేదంటూ దళిత ఎమ్మెల్యే ఆవేదన!
Follow us on

‘జగన్ జాగ్రత్తపడాలి..లేకపోతే సొంత ఎమ్మేల్యేల నుంచి తిరుగుబాటు జరిగే ప్రమాదం ఉంది’..ఇవి ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండటం, జగన్.. అవినీతికి ఆస్కారం ఇవ్వకపోడం, పని విషయంలో నిబ్ధతగా ఉండాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో..ముందు జాగ్రత్త హెచ్చరికగా ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రివర్గ విస్తరణలో సమయంలో, నామినేటెడ్ పదవులు విషయంలో ఎంతమంది ఆశావహులు ఉన్నారో చూశాం. ఖచ్చితంగా పదవి దక్కని వారికి ఎంతోకొంత అసమ్మతి ఉంటుంది. కానీ ఇప్పుడే అది మొదలైందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.

‘దళితులంటే చిన్న చూపు, నాకు స్వేచ్ఛ లేదు.. లక్షలాది మంది ఓట్లు వేసి తనను గెలిపిస్తే.. పని చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా.. ఇంకా వివక్షత కొనసాగుతోంది’ అంటూ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి రోజున మహాత్మడికి నివాళులు అర్పించిన ఆనంతరం..మీడియా సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కాగా వైసీపీలో నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి మొదలైనట్లు తెలుస్తుంది. ఇటీవలే మంత్రి అవంతి, వీఎమ్‌ఆర్డీ ఛైర్మన్ ద్రోణంరాజు మధ్య మాటల యుద్దం నడిచింది. అలాగే పలు ప్రాంతాల్లో నాయకులు మధ్య చాపకింద నీరుగా అసమ్మతి సెగ రగులుతోంది. కాగా తాజాగా ఎమ్మెల్యే బాబురావు మాట్లాడిన ఆ వీడియోను మాజీ మంత్రి, టీడీపీ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. దళితుల్ని ఇచ్చే స్థానం ఇదేనా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.

 

 

 

ఇక ఇటీవల మరో వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజినీ మాట్లాడుతూ..  నా అనుకున్న వాళ్లు సైతం తనను అడ్డుకోవాలని – నియంత్రించాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందరి అండదండలను తనకు కావాలని .. నిస్వార్థంగా పనిచేస్తానని అన్నారు. తన వెంట ఉండి వెన్నుపోటు పొడవాలని చూసే వారి అంతుచూస్తానని.. అదే తన నైజం అంటూ వైసీపీ ఎమ్మెల్యే రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అవినీతి గద్దలను తరిమివేయాలని జగన్ పార్టీలో చేరానని.. చిలకలూరిపేటకు పట్టిన పీడను వదిలిస్తానని ఎమ్మెల్యే రజినీ ఆగ్రహించారు.. అయితే కొన్ని దుష్ట శక్తులు తన కలలను చిదిమివేయాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను గెలిచి నాలుగు నెలలు అయినా ఆ ఆనందం లేదని.. సొంత పార్టీ నేతలతో యుద్ధం చేయాల్సి వస్తోందని ఎమ్మెల్యే రజినీ మండిపడ్డారు. ఆడపిల్లనైనా తాను సొంత పార్టీ నేతలతో నాలుగు వైపులా యుద్ధం చేయాల్సి వస్తోందని.. వారు శత్రువులు కాదని సొంత పార్టీ నేతలే అని ఆమె వాపోయారు. మరి ఈ లుకలుకలను అధిష్ఠానం ఎలా సెటిల్ చేస్తుందో చూడాలి.