ఖర్చు తగ్గించేందుకు జగన్ మరో సంచలన నిర్ణయం?

ఏపీ సర్కార్ ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తుంది. ఇప్పుడేముందిలే..ప్రమాణ స్వీకారం రోజు వేదిక నుంచే జగన్ ఈ పంథాను అవలంభిస్తున్నారు. సీఎంగా ముందుగా తానే రోల్ మెడల్‌గా మారారు. తాజాగా ఇప్పుడు వృథా ఖర్చలును మాగ్జిమమ్ ఎవైడ్ చేస్తున్నారు. సమీక్షల సమయాల్లో అధికారులను వెజ్ భోజనాలతో ఎడ్జెస్ట్ అవ్వమంటున్నారు. ఆఖరి వాటర్ బాటిల్ విషయంలో కూడా నియంత్రణ పాటిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్యా జగన్ ఈ డెషీసన్ తీసుకున్నారు.  స్టైల్ ఆఫ్ వర్కింగ్ […]

ఖర్చు తగ్గించేందుకు జగన్ మరో సంచలన నిర్ణయం?
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 03, 2019 | 4:00 AM

ఏపీ సర్కార్ ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తుంది. ఇప్పుడేముందిలే..ప్రమాణ స్వీకారం రోజు వేదిక నుంచే జగన్ ఈ పంథాను అవలంభిస్తున్నారు. సీఎంగా ముందుగా తానే రోల్ మెడల్‌గా మారారు. తాజాగా ఇప్పుడు వృథా ఖర్చలును మాగ్జిమమ్ ఎవైడ్ చేస్తున్నారు. సమీక్షల సమయాల్లో అధికారులను వెజ్ భోజనాలతో ఎడ్జెస్ట్ అవ్వమంటున్నారు. ఆఖరి వాటర్ బాటిల్ విషయంలో కూడా నియంత్రణ పాటిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్యా జగన్ ఈ డెషీసన్ తీసుకున్నారు.  స్టైల్ ఆఫ్ వర్కింగ్ విషయం పక్కన పెడితే.. గతంలో సీఎంగా ఉన్న సీఎం చంద్రబాబునాయుడు ఖర్చు విషయంలో అస్సలు వెనకాడేవారు కాదు అనే టాక్ ఉంది. ఆయనకు హైటెక్ లుక్ ఇష్టం. సమావేశాలు, సమీక్ష సమయంలో ఆయన ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగించేవారు. ఒక కార్యక్రమాన్ని పబ్లిసిటీ చేసే విషయంలో కూడా ఆయనకున్న అనుభవం ప్రస్పుటమవుతుంది. మీడియాలో, పత్రికల్లో ప్రకటనలు హైరేంజ్‌లో ఉంటాయి. ఐపాడ్‌లు, వీడియో కాన్పరెన్స్‌లు సరే..సరి. తాము చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బాబు కాస్త ఎక్కువగానే ఖర్చపెడతారనే సమాచారం ఉంది. 

కాగా సీఎం అయ్యాక అడపాదడపా ప్రకటనల్లో కనిపించారు జగన్. ఇకనుంచి అత్యవరసరమైతే తప్ప.. మీడియా, పత్రికల్లో ప్రకటనలకు పూర్తి స్థాయిలో దూరమవ్వనున్నారనే టాక్ వినిపిస్తుంది. తన పథకాల ద్వారా లబ్ధి పొందినవారు..నోటీ మాట ద్వారానే తనకు ప్రచారం చేసిపెడతారని సీఎం జగన్ అధికారులతో అన్నట్లు సమాచారం. ఈ విధంగా చేయడం ద్వారా  ఐదేళ్ల కాలంలో దాదాపు రూ .2,000 కోట్లు వరకు రాష్ట్ర ఖజానాకు ఆదా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. పరిపాలనను ప్రజల గుమ్మాలకు తీసుకువచ్చి, అన్ని ప్రయోజనాలను విస్తరించే గ్రామ కార్యదర్శులు, గ్రామ వలంటీర్లకు జీతాలు చెల్లించడానికి ఆ డబ్బును ఉపయోగించాలని సీఎం యోచిస్తున్నారట. 

గ్రామ స్వరాజ్యం, ప్రజల సంక్షేమం దిశగా తాను కన్న కలను నిజం చేయడం కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ తలపెట్టిన ప్రతిష్టాత్మక గ్రామ సచివాలయాలు  కార్యాచరణలోకి వచ్చిన విషయం తెలిసిందే. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా అందరికి సంక్షేమ పథకాలు అందేలా ఆయన అడుగులు ముందుకు వేశారు.