వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ఎన్నికల ప్రచారంలో స్పీడ్‌ను పెంచారు. ఇవాళ పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాసేపట్లో పోలవరంలో జగన్ రోడ్ షోలో పాల్గొంటారు. అవనిగడ్డ, వేమూర్ రోడ్ షోల్లో కూడా జగన్ పాల్గొంటారు.
సోమవారం రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు జగన్. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా చూశానని, తాను అధికారంలోకి వస్తే అవన్నీ పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు జగన్.