Mopidevi Venkata Ramana: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ కీలక వ్యాఖ్యలు!

|

Nov 06, 2021 | 1:33 PM

పెట్రోల్ , డీజిల్ ,గ్యాస్ ధరలను గత కొంత కాలంగా కేంద్రం అడ్డగా పెరిగాయని మండిపడ్డారు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ.

Mopidevi Venkata Ramana: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ కీలక వ్యాఖ్యలు!
Ycp Mp Mopidevi Venkata Ramana
Follow us on

YCP MP Mopidevi Comments: పెట్రోల్ , డీజిల్ ,గ్యాస్ ధరలను గత కొంత కాలంగా కేంద్రం అడ్డగా పెరిగాయని మండిపడ్డారు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో జనంలో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చ జరిపిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అయా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికస్థితిగతులను కేంద్రం పరిగణంలోకి తీసుకోవాలన్నారు మోపిదేవి. బీజేపీ రాష్ట్ర నాయకులు అడగాల్సింది కేంద్రాన్ని.. ఇక్కడ ధర్నాలు, ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కాదు.. కేంద్రంపై వత్తిడి తీసుకురాలని బీజేపీ నేతలకు సూచించారు.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు మోపిదేవి. కేంద్రం తగ్గించాల్సిన మోతాదులో తగ్గించాలన్న ఆయన.. అప్పుడు సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మా స్టాండ్ ఆనాడు – ఈనాడు ఒకటే అన్న ఎంపీ.. రాష్ట్రానికి హోదా కావాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్రంపై వత్తిడి తీసుకువస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు విషయంలో పవన్ డెడ్ లైన్ పెట్టాల్సింది కేంద్రానికే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి కాదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై నిర్ణయం తీసుకోవల్సింది కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన గుర్తు చేశారు. విశాఖ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము పోరాటం చేస్తూనే ఉన్నామని పార్లమెంట్ సభ్యులు మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు.

ఇదిలావుంటే, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం..అదే సమయంలో రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ తగ్గించాలని కోరింది. దీంతో స్పందించిన బీజేపీ పాలిత రాష్ట్రాలు తమకు వీలైనంతగా వ్యాట్ తగ్గిస్తూ పోటాపోటీగా నిర్ణయాలు ప్రకటించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని వినియోగదారులకు దీపావళి వేళ డబుల్ ధమాకా లభించినట్లయింది. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం కేంద్రం సూచనను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి బీజేపీయేతర రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గకపోవడంతో వినియోగదారుల్లో ఆసనం వ్యక్తమవుతోంది. మరోవైపు అయా పార్టీలు సైతం కేంద్ర ప్రభుత్వం తీరుపై పెదవి విరుస్తున్నాయి.

Read Also… YS Jagan: ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు.. లైవ్ వీడియో