ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షనేత జగన్ విరుచుకుపడ్డారు. మోసం అంటే చంద్రబాబు దగ్గరే నేర్చుకోవాలని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ చంద్రబాబు అమలు చేయలేదని వ్యాఖ్యానించారు. ‘‘విజయనగరం స్మార్ట్ సిటీ అన్నారు.. నదుల అనుసంధానం అన్నారు.. అన్నింటినీ విస్మరించారు’’ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎం అయ్యాక జిల్లాలో జూట్ మిల్లులు మూత పడ్డాయని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. సీబీఐ విచారణ అంటే చంద్రబాబుకు భయమెందుకు అని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చంద్రబాబు దొంగిలించారని జగన్ ఆరోపణలు గుప్పించారు.