జలం లేనిదే జీవం లేదు.. ప్రకృతి పంచ భూతాల్లో ఒకటికగా ఉన్న జలం సమస్త జీవకోటికి ప్రాణాధారం. ఏ ప్రాణి అయినా బతికి బట్ట కట్టాలంటే నీరు కావాల్సిందే. అలాంటి నీటిని నేడు ఎంతో మంది వృధా చేస్తుండటం భవిష్యత్తు తరాలకు తీరని ద్రోహం చేసినట్లే. నేడు ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు అందరినీ ఆలోచింప చేసే విధంగా ఉంది. ప్రతి ఒక్కరు నీటి ప్రాధాన్యతను గుర్తెరిగి నీటిని ఆదా చేయాలనే స్మితా సబర్వాల్ సందేశం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది.
రేపటి పిల్లల కోసం ఈ రోజు మహిళ ఆదా! అంటే ట్విట్టర్‌లో స్మితా సబర్వాల్ ఓ పోస్టును పెట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక కొండపై రిమోట్ పాల్సీ తండాకు చెందిన అనితా రాథోడ్ తన బిడ్డను టబ్బులో పెట్టి స్నానం చేస్తున్న ఫొటోను ట్యాగ్ చేశారు. ప్రసాద్ మార్తి అనే వ్యక్తి స్మితా సబర్వాల్‌ను సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. స్నానం అయిపోయాక అవే నీటిని ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్న అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టారు. మిషన్ భగీరథ బృందం అక్కడికి వెళ్లి ధృవీకరించింది. అయితే మిషన్ భగీరథ పథకం ద్వారా కావాల్సిన నీళ్లు వస్తున్నప్పటికీ నీటిని వృథా చేయకుడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు అనితా రాథోడ్ చెప్పారు.
మారు మూల గిరిజన తండాకు చెందిన అనితా మాటలు ఎంతో ఆలోచించే విధంగా ఉన్నాయని, అందరికీ స్ఫూర్తి దాయకంగా ఉన్నాయని స్మితా సబర్వాల్ చెప్పారు. మిషన్ భగీరథ నీరు రాక ముందు నీటి కోసం వారు పడ్డ కష్టమే నీటిని వృథా చేయకుండా చేసిందని అన్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా అనితా రాథోడ్ అందరికి స్ఫూర్తి దాయకంగా నిలిచారని చెప్పారు.
Woman of today saving for children of tomorrow !
Meet Anitha Rathod of remote Palsi thanda- atop a hill in Adilabad.
On seeing this tweet, MB team had gone to verify… and her response blew us away ! ?
‘I am getting sufficient water, but don’t like to waste it’#ValueWater ? pic.twitter.com/gB05cMVjNB— Smita Sabharwal (@SmitaSabharwal) March 22, 2021
Read More:
Telangana Budget: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు.. అసెంబ్లీలో మంత్రి జగదీశ్‌రెడ్డి క్లారిటీ
Telangana Budget: పెన్షన్లపై కేంద్రానివన్నీ దొంగ లెక్కలే.. అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి నిప్పులు